రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం – latest news

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం – latest news

కల్వకుర్తి ఆగస్టు 4 మన సాక్షి : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన బుధవారం రాత్రి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గురువారం స్థానిక ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం కల్వకుర్తి పట్టణంలోని బాల్ రాంనగర్ కాలనీకి చెందిన తాడేం శివ 32 తాడూర్ మండలం నుంచి బుధవారం రాత్రి TS04UB 4075 ఆటోలో పాల డబ్బాలు తీసుకొని కల్వకుర్తి పట్టణానికి వస్తుండగా కల్వకుర్తి నుంచి ఎదురుగా వస్తున్న TS05UC 3385 టిప్పర్ వాహనం పట్టణంలోని సంజాపూర్ గేటు వద్ద ఆటోకు ఢీ కొట్టడం జరిగింది.

ALSO READ : BREAKING : మిర్యాలగూడ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న తాడెం శివ 32 తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే పోలీస్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని తాడెం శివ మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రమేష్ తెలిపారు.