Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి, సోమవారం అర్ధరాత్రి ఘటన – latest news

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పెద్దఅడిశర్లపల్లి మండలం గణపురం స్టేజి వద్ద సోమవారం అర్ధరాత్రి ఘటన

నిడమనూరు, జూన్ 28, మనసాక్షి: నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం గణపురం స్టేజి వద్ద ఆగి ఉన్న టిప్పర్ ఢీ కొని మద్దిమడుగు బిక్షం(38) మృతి చెందిన ఘటన సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అంగడిపేట గ్రామానికి చెందిన మద్దిమడుగు బిక్షం . పెద్దవూర మండలం చింతపల్లి గ్రామంలోని అత్తారింటికి సోమవారం అర్థరాత్రి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గణపురం స్టేజీ వద్ద ఆగి ఉన్న టిప్పర్ ను ద్విచక్ర వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని దేవరకొండ ఏరియా ఆస్పత్రికి మార్చురీకి తరలించారు.మృతుడి బందువులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

1. ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య – latest news

2. ఫ్లాష్ .. ఫ్లాష్ … రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

3. మద్యం తాగి వివాహ వేదిక మీదికి వరుడు, మరదలు చేసిన పనికి అంతా షాక్ (వీడియో)

మరిన్ని వార్తలు