Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Hyderabad : పరుగుల సత్యం.. నేటి యువతకు ఆదర్శం..!

Hyderabad : పరుగుల సత్యం.. నేటి యువతకు ఆదర్శం..!

మనసాక్షి, హైదరాబాద్ :

మారిన జీవన విధానం లో ఏదోటి వ్యాయామం తప్పనిసరి అయింది. అందుకు అనుగుణంగా హైదరాబాద్ మల్టీ జోన్ 2 ఐజీ కార్యాలయం లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ వాడ్నాల సత్యనారాయణ ఫుల్ మార్టన్ లో తన ప్రతిభ ను కనబరిచి పలువురితో పరుగుల సత్యం గా పేరొందుతూ షభాష్ అనిపించుకుంటున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ గ్రామానికి చెందిన సత్యనారాయణ కు చిన్నప్పటి నుంచి పరుగుల పందెం పోటీల్లో ప్రతిభ కనబరిచి మండల జిల్లా రాష్ట్ర స్థాయి లో పలు పతకాలు అందుకున్నారు.

1998లో కానిస్టేబుల్ గా ఎంపికైన ఈయన కొద్దీ కాలం పరుగుల పందెం ఆపి తిరిగి గత ఆరేళ్లుగా ప్రాంభించారు. మంచి ఆరోగ్యం ఉండాలంటే పరుగు పందెం ముఖ్యమని భావించిన ఆయన పరుగులు తీస్తూనే ఉన్నారు.

రోజు వారి దినచర్య లో భాగంగా సుమారు 20కిలో మీటర్లు మేర పరుగు తీయడం అలవాటుగా మారిపోయింది గత రెండేళ్ల క్రితం అప్పటి ఐజీ 21 కిలోమీటర్లు మార్టన్ లో పతకం అందుకున్నారు. గత రేందు రోజుల క్రితం హైదరాబాద్ లో నిర్వహించిన ఫుల్ మార్టన్ లో ప్రతిభ కనబరిచారు.

మల్టీ జోన్ ఐజీ తప్సీర్ ఇక్బల్ మెడల్ అందజేసి అభినందించారు ఈ సందర్బంగా ఐజీ మాట్లాడుతూ ప్రస్తుతం వచ్చిన జీవన విధానం లో మార్పులను గమనించి పోలీస్ శాఖ తో పాటుగా నేటి యువత సత్యనారాయణ ను ఆదర్శం గా తీసుకోవాలన్నారు.

MOST READ : 

  1. Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. తిప్పర్తి ఘటన కేసులో 50 ఏళ్ల జైలు, 80 వేల జరిమానా..!

  2. Choutuppal : జాతీయస్థాయి కుంగ్ ఫూ, కరాటే పోటీలలో కృష్ణవేణి విద్యార్థుల ప్రతిభ..!

  3. Nalgonda : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన.. వారికి అధునాతన వైద్య సౌకర్యాలు..!

  4. District collector : జాతీయ కుటుంబ ప్రయోజనం పథకానికి దరఖాస్తుల ఆహ్వానం.. మీరు అర్హులు అయితే దరఖాస్తు చేసుకోండి..!

మరిన్ని వార్తలు