Suryapet | ఘనంగా సంతోషిమాత బ్రహ్మోత్సవములు

ఘనంగా సంతోషిమాత బ్రహ్మోత్సవములు

సూర్యాపేట , మనసాక్షి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ సంతోషిమాత దేవాలయం ప్రతిష్టించ బడి 28 ఏండ్లు పూర్తి ఐన సందర్భముగా మంగళవారం శ్రీ సంతోషిమాత బ్రహ్మోత్సవములను ఘనంగా నిర్వహించారు.

 

ఈ సందర్భముగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ తెల్లవారుజామునే శ్రీ సంతోషిమాత,శ్రీ సత్య సాంబ శివుడు,శ్రీ లక్ష్మీ గణపతి,శ్రీ ఆంజనేయ స్వామి,శ్రీ సంతాన నాగదేవతలకు ప్రత్యేక పంచామృత అభిషేకం నిర్వహించారు.

 

బ్రహ్మోత్సవముల సందర్భముగా కలశస్థాపన పూజ,పుణ్యాహవాచనం,మంటప ఆరాధన పూజలు నిర్వహి చారు.లక్ష్మిగణపతి,రుద్ర,లలితా హోమమం మహా పూర్ణాహుతి నిర్వహించారు.

 

Also Read : Central scheme : కేంద్ర ప్రభుత్వ పథకం.. నెలకు రూ. 10 వేలు ఎవరైనా పొందొచ్చు

 

బ్రహ్మత్సవముల.సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన,గాజుల పూజ,పసుపు కొమ్ముల పూజ,మల్లెల పూజ నిర్వహించారు. శ్రీ సంతోషిమాత కు త్రిభువన మహా సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించి మహదాశీర్వచనం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదం నిర్వహించారు.

 

ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష,కార్యదర్శులు నూకా వెంకటేశంగుప్తా,బ్రాహ్మండ్లపల్లి మురళీధర్ కోశాధికారి పాలవరపు రామమూర్తి కమిటీ సభ్యులు బెలీదే అశోక్,తిరునగరు యాదగిరి, తాళ్ళపల్లి రామయ్య,బ్రాహ్మణ పల్లి బ్రహ్మయ్య,సోమా శ్రీశైలం,యామా వెంకటేశ్వర్లు, బొనగిరి విజయ్ కుమార్, సురం గోపాల్ రెడ్డి,

 

నూకాముత్యాలమ్మ, బోనగిరి నాగలక్ష్మి, మహంకాళి కవిత, కొల్లూరురత్నమాల, కర్నాటి సూర్యకళ, కంచర్లలీల, పాటి వనజ, ఉగ్గంయాకమ్మ,పుష్ప, గుండాసునీత, కాతేపల్లి మీరాబాయి, తల్లాడ రమ,కుక్కడపు ధనలక్ష్మి,

 

Also Read : Good News : దక్షిణ మధ్య రైల్వే లో ఉద్యోగాలు, వేతనం 44,900

 

ఓరుగంటి జగదీశ్వరి,ఓరుగంటి కనక రత్నం ఆలయ అర్చకులు భట్టారం వంశీ కృష్ణ శర్మ, దరూరి కృష్ణమాచార్యులు, గోమటం రాఘవాచార్యులు, దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.