సూర్యాపేట : ఎస్సీ వర్గీకరణ పట్ల అధికార ప్రతిపక్ష పార్టీలకు చిత్తశుద్ధి లేదు

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

సూర్యాపేట : ఎస్సీ వర్గీకరణ పట్ల అధికార ప్రతిపక్ష పార్టీలకు చిత్తశుద్ధి లేదు

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

సూర్యాపేట రూరల్, మనసాక్షి

ఎస్సీ వర్గీకరణ పట్ల అధికార ప్రతిపక్ష పార్టీలకు చిత్తశుద్ధి లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. గురువారం ఎమ్మార్పీఎస్ సూర్యపేట జిల్లా ఇంచార్జ్ తూరుగంటి అంజయ్య మాదిగ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ ఎస్సీ వర్గీకరణ సాధన కోసం గత 29 సంవత్సరాల పోరాటమని, భారతదేశంలో తన హక్కుల కోసం పోరాటం చేస్తున్నది, ఒక మాదిగ దండోరా మాత్రమే అని ఈ పోరాటం ఒక భారతదేశంలోనే కొనసాగుతుందని అన్నారు.

 

ఈ సమాజంలో నిత్యం పోరాటం చేస్తున్నది ఎమ్మార్పీఎస్ నే అని ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగల జీవితాల్లో వెలుగులు నిండుతాయని, ఎస్సీ వర్గీకరణ సాధించడమే తప్ప మరో పరిష్కార మార్గం లేదని అన్నారు. వర్గీకరణ సాధన కొరకు మాదిగలంతా ఒక్కతాటిపై రావాలని వర్గీకరణ సాధించుకోవాలని, ఈ పోరాటం గత 29 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని అన్నారు.

 

కేంద్రంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు కోసం కేంద్రంతో ప్రతిపక్షాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో తేల్చుకోబోయే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధించేవరకు పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టే వరకు మన పోరాటం కోసం తీవ్రతరం చేయడం కోసం విశ్వరూప మహాసభ నిర్వహిస్తున్నామని ఈ సభను విజయవంతం చేయడానికి మాదిగలంతా కుటుంబ సమేతంగా కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

 

ALSO READ : 

  1. Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!
  2. TSRTC : తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో స్వాతంత్ర దినోత్సవ ఆఫర్.. టి – 24 టికెట్..!
  3. TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!
  4. TSPSC : టి ఎస్ పి ఎస్ సి గ్రూప్ -2 పరీక్ష తేదీలు మారాయి.. కొత్త తేదీలు ఇవే..!

 

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ, ఎం ఎస్ పి రాష్ట్ర నాయకులు ఎర్ర వీరస్వామి మాదిగ, జిల్లా నాయకులు బోడ శ్రీరాములు మాదిగ ,కొండపల్లి ఆంజనేయులు ,ఏపూరి రాజు, ఎం ఎస్ పి నియోజకవర్గ ఇన్చార్జ్ పుట్టల మల్లేష్ మాదిగ ,మహిళ నాయకురాలు మారేపల్లి సావిత్రి ,పిడమర్తి నాగేశ్వరి నాయకులు ములకలపల్లి రవి,

 

ములకలపల్లి మల్లేష్ ,చింత సతీష్ మాదిగ,ఎంఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మామిడి కరుణాకర్ మాదిగ, కందుకూరి శ్రీనివాస్, పాల్వాయి బాలయ్య, రెబల్ శ్రీనివాస్ ,బొడ్డు విజయ్ ,తాటిపాముల నవీన్ ,బొజ్జ వెంకన్న, మేడి కృష్ణ, బత్తుల వెంకట రాములు తదితరులు పాల్గొన్నారు.