Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

సూర్యాపేట : నర్సరీల పట్ల నిర్లక్ష్యం.. కార్యదర్శికి షోకాజ్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశం

సూర్యాపేట : నర్సరీల పట్ల నిర్లక్ష్యం.. కార్యదర్శికి షోకాజ్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశం

సూర్యాపేట రూరల్ , మనసాక్షి

సూర్యాపేట మండలంలోని టేకుమట్ల గ్రామంలో పెంచుతున్న నర్సరీలను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. నర్సరీలో 60 శాతం( జర్మినేషన్) విత్తనోత్పత్తి లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్ పంచాయతీ సెక్రెటరీ నరసింహారావు పై అసంతృప్తి వ్యక్తం చేశారు. నర్సరీ లో ఉన్న మొక్కలకు వాటరింగ్ చేయకపోవడంపై, నర్సరీ నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించిన ఫీల్డ్ అసిస్టెంట్ యాదయ్య పై శాఖ పరమైన చర్యలు తిసుకోవలసిందిగా డిపిఓకు కలెక్టర్ ఆదేశించారు.

 

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కల పెంపకం,నర్సరిల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ తెలిపారు. ప్రక్కనే ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా ఉండి మొక్కలకు నీరు పెట్టకపోవడంపై కలెక్టర్ పంచాయతీ సెక్రటరీ నరసింహారావు మందలించారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తున్నందుకు పంచాయతీ సెక్రటరీ షోకాజ్ నోటీస్ ఇవ్వవలసిందిగా కలెక్టర్ డీపీఓ కు ఆదేశించారు.

 

మండల స్పెషల్ ఆఫీసర్లు అభివృద్దిపనుల నిరంతర పర్యవేక్షణ చేయాలని నర్సరీలను ఆకస్మికంగా సందర్శించి నివేదిక అందజేయాలని కలెక్టర్ తెలిపారు. ముందుగా టేకుమట్ల గ్రామ రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొని వచ్చిన ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించారు, ధాన్యం తేమ శాతాన్ని మిషన్ ద్వారా కలేక్టర్ పరిశీలించారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వచ్చే విధంగా వ్యవసాయ అధికారులు రైతులకు తెలపాలని కలెక్టర్ పేర్కొన్నారు.

 

పిఎసిఎస్ వారు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వార కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ట్యాబ్లో ఎంట్రీ చేశారా లేదా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల పర్యవేక్షణ కొరకు మండల, డివిజన్, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిపిఓ యాదయ్య, తాసిల్దార్ ఎంకన్న, ఏవో జానీ మియా, పిఎసిఎస్ సెక్రటరీ వాసు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు