శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ గోడపత్రిక ఆవిష్కరణ..!
శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ గోడపత్రిక ఆవిష్కరణ..!
చింతపల్లి, మన సాక్షి :
మండల పరిధిలోని గోడకొండ్ల గ్రామంలో గల పురాతన దేవాలయం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో నేటి నుండి ఈ నెల 19 వరకు అత్యంత వైభవోపేతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్వాహకులు సర్వం సన్నద్ధం చేస్తున్నట్లు శ్రీ వేణుగోపాల స్వామి గుడి చైర్మన్ అంగి రేకుల గోపాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్ర కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించేందుకు సమాయత్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా మంగళవారం దేవాలయ ప్రాంగణంలో స్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికను వారు ఆవిష్కరించారు. ఈ బ్రహ్మోత్సవాలకు వివిధ పార్టీల ముఖ్య నాయకులు హాజరవుతున్నట్టు వారు వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలోహనుమాన్ యువసేన, సిద్ధి వినాయక యూత్ సభ్యులు, బిజెపి నాయకులు గొట్టి పర్వతాలు, బాదేపల్లి నిరంజన్ గౌడ్, పోలేపల్లి నరేష్, పాల కోట్ల శంకర్, గ్యార పోశయ్య, పాండు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు :
Telangana : ఆ కంపెనీ దగ్గర రూ.300 కోట్లు తీసుకొని ఢిల్లీకి పంపింది నిజం కాదా..?
Marakatha Shivalayam : కోరికలు తీర్చే కొంగు బంగారం మరకత శివాలయం..!









