ఎమ్మెల్యే కృషి తో శాదిఖానా కు మోక్షం…!
తడ్కల్ లో పునః ప్రారంభమైన భవన నిర్మాణ పనులు

ఎమ్మెల్యే కృషి తో శాదిఖానా కు మోక్షం…!
తడ్కల్ లో పునః ప్రారంభమైన భవన నిర్మాణ పనులు
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని తడ్కల్ గ్రామంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ భూపాల్ రెడ్డి కృషితో మంగళవారం షాదిఖానా భవన నిర్మాణ పనులు పునః ప్రారంభమయ్యాయి.
తడ్కల్ గ్రామంలో గత 2016 సంవత్సరంలో మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డితో కలిసి షాది ఖానా భవన నిర్మాణానికి 5 లక్షల రూపాయల హెచ్ డి ఎఫ్ నిధులతో భూమి పూజ చేసి ప్రారంభించగా, పనులు చేపట్టిన గుత్తేదారు నిధులు కొరత కారణంగా షాది ఖానా భవన నిర్మాణ పనులను బేస్ మెంట్ స్థాయి వరకు నర్మించి వదిలి వేశాడు.
ALSO READ :
- Atm Card : ఏటీఎం కార్డు వినియోగదారులకు ఆర్బీఐ కొత్త రూల్స్.. మారిన నిబంధనలు..!
- Telangana : తెలంగాణలో రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు..!
- Telangana : సారూ.. ఏవీ..? ఆ.. రూ.10 వేలు..?
- వేములపల్లి : ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తి అరెస్టు, రిమాండ్..!
ప్రస్తుతం ఏడు సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి షాదిఖాన భవన నిర్మాణానికి డిఎంఎఫ్ ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరు చేయడంతో, షాది ఖానా భవన నిర్మాణ పనులను మంగళవారం తిరిగి ప్రారంభించినట్లు, మండల జడ్పిటిసి కోట లలిత ఆంజనేయులు, ఆత్మ కమిటీ డైరెక్టర్ రమేష్ , మాజీ సర్పంచ్ సత్యనారాయణ తెలిపారు.
షాది ఖానా భవన నిర్మాణ పనుల కోసం ఎమ్మెల్యే 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడంతో, తడ్కల్ ముస్లిం సోదరులు ఎమ్మెల్యే కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.