షాకిర్ బాబాకు ప్రశంసపత్రం, అవార్డు

షాకిర్ బాబాకు ప్రశంసపత్రం, అవార్డు

నలగొండ, ఆగస్టు 15, మనసాక్షి : భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నల్గొండ డిపిఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సయ్యద్ షాకిర్ బాబా కు విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచినందుకు గాను ఉత్తమ జూనియర్ అసిస్టెంట్ గా ప్రశంస పత్రం, అవార్డును సోమవారం అందుకున్నారు.

ALSO READసాయిచరణి పుట్టినరోజు వేడుకల్లో మహిళలకు చీరల పంపిణీ

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా నల్గొండ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ రేమా రాజేశ్వరి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో పాటు, అధికారులు, తదితరులు ఉన్నారు. పోలీస్ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు సయ్యద్ షాకిర్ బాబాకు అభినందించారు.