సాయిచరణి పుట్టినరోజు వేడుకల్లో మహిళలకు చీరల పంపిణీ

సాయిచరణి పుట్టినరోజు వేడుకల్లో మహిళలకు చీరల పంపిణీ

అభ్యాస్ విద్యాసంస్థల వితరణ

మిర్యాలగూడ, ఆగస్టు 15, మనసాక్షి : నిరంతరం ఇతరులకు చేయూత అందించడంలో.. సేవా కార్యక్రమాలలో ప్రముఖ అభ్యాస్ విద్యాసంస్థల చైర్మన్, మిర్యాలగూడ మున్సిపల్ 25 వ వార్డు టిఆర్ఎస్ కౌన్సిలర్ వంగాల నిరంజన్ రెడ్డి ముందుంటారు. తన పెద్ద కుమార్తె వంగాల సాయిచరణి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా తమ వార్డు పరిధిలోని 100 మందికి మహిళలకు సోమవారం చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

 

అభ్యాస్ విద్యాసంస్థల డైరెక్టర్ వంగాల పుష్పలత నిరంజన్ రెడ్డి, సాయిచరణిల చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఇక నుంచి ప్రతి సంవత్సరం విజయదశమి పండుగ ముందు సాయిచరణి పుట్టినరోజు సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డు ప్రముఖులు, వార్డు పెద్దలతో పాటు పాఠశాల ఉపాధ్యాయులతో పాటు ఆచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు మహిళలు సాయిచరణి కి దీవెనలు అందించారు. అనంతరం వార్డు ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేశారు.