Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

శాలిగౌరారం ప్రాజెక్టుకు యాదగిరిరెడ్డి పేరు పెట్టాలి.. మంత్రి ఉత్తమ్ కి వినతి..!

శాలిగౌరారం ప్రాజెక్టుకు యాదగిరిరెడ్డి పేరు పెట్టాలి.. మంత్రి ఉత్తమ్ కి వినతి..!

శాలిగౌరారం, మనసాక్షి

నల్లగొండ జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు లో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్టు కు ప్రముఖ గాందేయవాది, స్వాతంత్ర్య సమరయోధులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత,స్వర్గీయ చామల యాదగిరి రెడ్డి పేరు పెట్టాలని పలువురు రైతులు, నాయకులు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.

నల్గొండ జిల్లా శాలిగౌరారం నకు చెందిన చామల యాదగిరి రెడ్డి శాలిగౌరారం ప్రాజెక్టు అభివృద్ధికి ఎంతో కృషి చేశాడాని, ఈ ప్రాజెక్టు తో నేడు వేలాది భూములు సస్యశ్యామలం అవుతున్నాయని పేర్కొన్నారు. యాదగిరి రెడ్డి చివరి శ్వాస వరకు ప్రాజెక్టులోకి నీరు తీసుకరావడానికి తాపత్రయ పడిన మహనీయుడన్నారు.

శాలిగౌరారం మండల అభివృద్ధి కొరకు, మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయ నిర్మాణాల కొరకు, వ్యవసాయ మార్కెట్ స్థాపన కొరకు, విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు కు అవిరాల కృషి చేశాడాని అందుకే అయన జ్ఞాపకార్థం ప్రాజెక్టు కు పేరు పెట్టాలని కోరారు.

ప్రాజెక్టు కట్ట మీద యాదగిరి రెడ్డి విగ్రహాన్ని కూడా ప్రతిష్టించాలని కోరారు. ప్రెస్ అకాడమీ రాష్ట్ర ఛైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి కూడా చామల యాదగిరి రెడ్డి గురుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి వివరించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో కోమటిరెడ్డి ప్రతీక్ మొమోరియల్ ట్రస్ట్ కన్వీనర్ ఎం వి గోనారెడ్డి,చామల వెంకటరమణా రెడ్డి, గూని వెంకటయ్య, పడాల రమేష్, లోడంగి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

Rythu Barosa : రైతు భరోసా వారికేనా.. ఆలస్యం అందుకేనా..!

Runamafi : రుణమాఫీ రైతులకు వడ్డీ భారం.. బ్యాంకర్ల మెలిక..!

Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. 50 కంపెనీలతో మెగా జాబ్ మేళ.. టెన్త్ పాస్ అయిన వారికి కూడా అవకాశం..!

Good News : ప్రభుత్వం గుడ్ న్యూస్.. మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత కుట్టు మిషన్ పథకం, దరఖాస్తు చేసుకోండి ఇలా..!

Good News : ప్రభుత్వం గుడ్ న్యూస్.. మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత కుట్టు మిషన్ పథకం, దరఖాస్తు చేసుకోండి ఇలా..!

మరిన్ని వార్తలు