Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsసంగారెడ్డి జిల్లా

జ్ఞానానికి దిక్సూచి శంకరాచార్యులు..!

సనాతన ధర్మ పరిరక్షణలో విశిష్ట స్థానం జగద్గురు ఆది ఆదిశంకరాచార్యులని భారతీయ ఆధ్యాత్మిక లోకంలో చిరస్థాయిగా నిలిచారని సంగారెడ్డి జిల్లా బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం పీఠాధిపతి వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ తెలిపారు.

జ్ఞానానికి దిక్సూచి శంకరాచార్యులు..!

  • వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్

  • ఈనెల 5న విగ్రహావిష్కరణ

  • హాజరుకానున్న మంత్రి

జహీరాబాద్, మన సాక్షి:

సనాతన ధర్మ పరిరక్షణలో విశిష్ట స్థానం జగద్గురు ఆది ఆదిశంకరాచార్యులని భారతీయ ఆధ్యాత్మిక లోకంలో చిరస్థాయిగా నిలిచారని సంగారెడ్డి జిల్లా బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం పీఠాధిపతి వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ తెలిపారు. అద్భుతమైన జ్ఞానం, తత్వచింతనతో అద్వైత వేదాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసి, “బ్రహ్మం ఒక్కటే సత్యం” అనే సిద్ధాంతాన్ని బోధించారని పేర్కొన్నారు.

ఆశ్రమ ఆవరణంలో ఈ నెల 5న జరిగే దత్తగిరి మహారాజ్ అమర తిథి సందర్భంగా ఆది శంకరాచార్యుల విగ్రహావిష్కరణకు సంబంధించి గోడపత్రికను ఆదివారం ఆవిష్కరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దత్తగిరి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆది శంకరాచార్యులకు సంబంధించిన 108 విగ్రహాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ హాజరుకానున్నారని వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజు, నాయకులు నీలా వెంకటేశం, నాగన్న పాటిల్, అంజన్న వైదిక పాఠశాల విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు