షర్మిల పాదయాత్రకు బ్రేక్, తిరిగి 13 లేదా 14న పునః ప్రారంభం – latest news

షర్మిల పాదయాత్రకు బ్రేక్, తిరిగి 13 లేదా 14న పునః ప్రారంభం

సూర్యాపేట, జూలై 10, మనసాక్షి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం నుంచి పునఃప్రారంభం కావాల్సిన వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ నెల 12 వరకు వాయిదా వేశారు.

పరిస్థితుల పరిశీలన అనంతరం ఈ నెల 13 లేదా 14 నుంచి పాదయాత్ర సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గం గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామం నుంచి ప్రారంభం కానుందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాం రెడ్డి తెలిపారు.

ఇది కూడా చదవండి : 

1. ఆటోలో నుంచి జారిపడ్డ బాలుడిని బస్సు కింద పడకుండా కాపాడిన ట్రాఫిక్ పోలీస్ (వీడియో)

2. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం, వరంగల్ డిక్లరేషన్ పై సమీక్ష

3. వర్షాల నేపథ్యంలో రక్షణ చర్యలు చేపట్టాలి – సీఎం కేసీఆర్