వర్షాల నేపథ్యంలో రక్షణ చర్యలు చేపట్టాలి – సీఎం కేసీఆర్

వర్షాల నేపథ్యంలో రక్షణ చర్యలు చేపట్టాలి

రెవెన్యూ సదస్సులు వాయిదా

వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు

హైదరాబాద్, మనసాక్షి : ఎడతెరిపి లేని వర్షాల కారణంగా సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు సహా సంబంధిత శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ALSO READ : BREAKING : వైసీపీకి విజయమ్మ రాజీనామా

వరద ముంపు ప్రాంతాల్లో అధికారులను, ఎన్డీఆర్ఎఫ్ రిస్క్ టీం లను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. మహారాష్ట్ర తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటానని రేపు కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని తెలిపారు. తెలంగాణలోని ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆయా ప్రాంతాల్లో ప్రజల రక్షణ నిమిత్తం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రక్షణ చర్యల్లో ప్రజలకు సహాయపడుతూ నష్టాలు జరగకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు .

ALSO READవాన నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు, తప్పిన ప్రమాదం – latest news

భారీ వర్షాల కారణంగా అనవసరంగా రిస్కు తీసుకోవద్దని, అవసరమైతే తప్ప ప్రజలు బయటికి వెళ్లొద్దని స్వీయ జాగ్రత్తలు పాటించాలని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున వరదలు వస్తున్నాయని ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ALSO READ : గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులు అతలాకుతలం – నల్లమోతు భాస్కర్ రావు

అదేవిధంగా రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన ప్రగతి దిభవన్ లో నిర్వహించ తలపెట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల రెవెన్యూ సదస్సుల అవగాహన సమావేశం తో పాటు 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించ తలపెట్టిన రెవెన్యూ సదస్సులను వాయిదా వేస్తున్నట్లు కెసిఆర్ తెలిపారు.