Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Nalgonda : ఘనంగా శ్రీ కృష్ణవేణి హై స్కూల్ వార్షికోత్సవ సంబరాలు..!

Nalgonda : ఘనంగా శ్రీ కృష్ణవేణి హై స్కూల్ వార్షికోత్సవ సంబరాలు..!

నల్లగొండ, మన సాక్షి :

నార్కట్ పల్లి మండలంఎల్లారెడ్డిగూడెం లోని శ్రీకృష్ణవేణి హై స్కూల్ లో వార్షికోత్సవ సంబరాలు శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా కన్నుల పండుగ నిర్వహించారు. తల్లిదండ్రులకు పాదపూజ మహోత్సవాన్ని సాంప్రదాయ బద్ధంగా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అంటూ వేదమంత్రాల నడుమ భక్తిశ్రద్ధలతో నిర్వహించి తల్లిదండ్రులపై పూల వర్షం కురిపించారు.

అలాగే విద్యార్థులు డ్రగ్స్ గంజాయి బారిన పడకుండా దురాలవాట్లకు పోకుండా మోటివేటర్తో అవగాహన కలిగించారు. అలాగే పాఠశాలల్లో సమాజంలో ఉపాధ్యాయుల పట్ల తల్లిదండ్రుల పట్ల పెద్దలపట్ల ఎలా మెలగాలో ఎలా ప్రవర్తించాలో నైతిక విలువలపై అవగాహన కలిగించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వనజీవి పద్మశ్రీ రామయ్య మాట్లాడుతూ తల్లిదండ్రులను మించిన దైవం లేదని వారిని గౌరవించడం విద్యార్థి దశనుండే అలవాటు చేసుకోవాలని చిన్నతనం నుండే విద్యార్థులకు తల్లిదండ్రుల పట్ల గౌరవం నైతిక విలువలు నేర్పుతున్న పాఠశాల యజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ పచ్చదనం పరిశుభ్రత కోసం పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులు చిన్నప్పటినుండే మొక్కలు నాటాలని సూచించారు.

అంతకుముందు పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు డ్యాన్సులు కర్ర సాము.విన్యాసాలు దేశభక్తిని పెంపొందించే విద్యార్థుల విన్యాసాలు ఆటలు పాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా కేరింతలతో తల్లిదండ్రులు సంతోషపడే విధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్. ప్రిన్సిపాల్ మట్ట చిన్నయ్య గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాలలు పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతులు నిర్వహించి ప్రతి సంవత్సరం పాదపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని

ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో మన ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు మానవత్వ విలువలు తల్లిదండ్రుల పట్ల పెద్దలపట్ల గౌరవ మర్యాదలతో నడుచుకునే విధంగా ఈ కార్యక్రమం దోహదపడుతుందని అదేవిధంగా కుటుంబం దేశం పట్ల పర్యావరణం పట్ల అవగాహన పెంపొందుతుందని మంచి భావిభారత పౌరులుగా కీచుద్దడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. అనంతరం లక్కీ డిప్ ద్వారా ముగ్గురు విద్యార్థులకు బహుమతులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి డాక్టర్ కోడి శ్రీనివాసులు నూనె సుదర్శన్ జబ్బు వెంకటేష్ విశిష్ట అతిథులుగా వచ్చి తల్లిదండ్రులను విద్యార్థిని విద్యార్థులను ఆశీర్వదించడం జరిగింది వీరిని పాఠశాల చైర్మన్ మట్టా సబిత పాఠశాల సిబ్బంది ఘనంగా సత్కరించడం జరిగింది.

ఈ పాఠశాల విద్యార్థిని తండ్రిగారైన పట్ల లింగయ్య మాట్లాడుతూ పాఠశాల దశలోని విద్యార్థులలోని మానవతా విలువలు తల్లిదండ్రులను గౌరవించడం. దేశం ,ప్రకృతి పట్ల అవగాహన కల్పించినందుకు తల్లిదండ్రులకు చేసిన పాదపూజ మా జీవితంలో మరపురాని మధురగట్టంగా వర్ణించారు పాదపూజతో తాము పులకించిపోయమని పాఠశాల ప్రిన్సిపాల్ చైర్మన్ డాక్టర్ చెన్నయ్య గౌడ్ సార్ కు సవిత మేడంకి ప్రత్యేక ధన్యవాదాములు తెలియజేశారు.

మరొక విద్యార్థి తల్లిగారు స్పందిస్తూ ఇలాంటి కార్యక్రమం నా జీవితంలో చూడలేదని ఇది నన్ను ఎంతో భావోద్వేగానికి గురి చేసిందని మా పిల్లలు మా పట్ల చూపిస్తున్న ప్రేమ గౌరవానికి వారి ప్రవర్తనలో మార్పుకు కారణమైనటువంటి పాఠశాల యజమాన్యానికి కృతజ్ఞతలు.

చివరగా పాఠశాల చైర్మన్ మట్ట సబిత మాట్లాడుతూ ఈ కార్యక్రమాని దిగ్విజయం చేసినటువంటి తల్లిదండ్రులకు అతిథులకు విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.

MOST READ : 

  1. Miryalaguda : మిల్లర్లకు సబ్ కలెక్టర్ హెచ్చరిక.. ధాన్యం కింటాకు రూ.2300 లకు కొనుగోలు చేయకుంటే చర్యలు..!

  2. Gold Price : వరుసగా రెండో రోజు పడిపోయిన బంగారం ధర.. ఈ రోజు తులం ఎంతంటే..!

  3. WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే ప్రైవసీ.. సెండ్ చేసినా సేవ్ చేసుకోలేరు..!

  4. Miryalaguda : బలంపియాడ్ పరీక్షలో సెయింట్ జాన్స్ విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు.!

మరిన్ని వార్తలు