Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

BREAKING : నారాయణపేట జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సిక్తా పట్నాయక్..!

BREAKING : నారాయణపేట జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సిక్తా పట్నాయక్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా నూతన కలెక్టర్ గా సిక్తా పట్నాయక్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సిక్తా పట్నాయక్ నారాయణ పేట జిల్లా కలెక్టర్ గా బదిలీ అయిన సందర్భంగా ఆదివారం ఇక్కడి జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ గా ఆమె బాధ్యతలు స్వీకరించారు.

నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ను జిల్లా రెవెన్యూ ఆదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కలెక్టరేట్ ఏ.ఓ. నర్సింగరావు, డిపిఆర్ఓ ఎం.ఏ.రషీద్, కలెక్టరేట్ వివిధ సెక్షన్ ల పర్యవేక్షకులు, సిబ్బంది, అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు. కాగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ శిక్తా పట్నాయక్ కలెక్టరేట్ లోని వివిధ విభాగాల కార్యాలయాలను పరిశీలించారు.

ALSO READ : 

TELANGANA : పోలీస్ అకాడమీలో ఐఏఎస్ ట్రైనీ కుమార్తెకు తండ్రి ఎస్పీ సెల్యూట్..!

Telangana : టిడిపిలోకి మల్లారెడ్డి.. తెలంగాణ అధ్యక్షుడు అతడేనా..? కెసిఆర్ షాక్..!

Runa Mafi : రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి విధి విధానాలు సిద్ధం, సర్వత్ర చర్చ..!

మరిన్ని వార్తలు