Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం
గంజాయి మత్తులో ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి
గంజాయి మత్తులో ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి
గుంటూరు, మనసాక్షి :
గంజాయి మత్తులో ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పొన్నూరులో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. అరేళ్ల బాలుడు స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్నాడు.
శుక్రవారం పాఠశాల ముగిసాక ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. కాగా అటుగా వచ్చిన పవన్ సంజయ్ (20) గంజాయి మత్తులో బాలుడిని గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడు కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళు గమనించి అక్కడికి వచ్చి అతడికి దేహశుద్ధి చేశారు.
కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలుడిని పొన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు.
MOST READ :
- Google Crome : గూగుల్ క్రోమ్ అప్ డేట్ చేసుకోకుంటే ముప్పు తప్పదు.. ఇలా చేసుకోండి..!
- Phone Charging : ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా..? ఈ పొరపాట్లు చేస్తే పేలిపోతుంది..!
- మూడేళ్ల కుమారుడు కు విషం ఇచ్చి.. ఆత్మహత్యాయత్నం కు పాల్పడ్డ తల్లి..!
- Admin Review : కొత్త టూల్స్.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ల శక్తివంతం ..!









