సూక్ష్మ కళాఖండాల ప్రదర్శన

సూక్ష్మ కళాఖండాల ప్రదర్శన

మేళ్లచెరువు, మనసాక్షి: బియ్యపు గింజలు, ఆకులపై చెక్కిన వివిధ కళాఖండాలను మేళ్లచెరువు మైహోం సిమెంట్స్ లిటిల్ స్కాలర్ స్కూల్ విద్యార్ధులు శనివారం తిలకించారు. కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు,వరల్డ్ రికార్డ్ హోల్డర్ తమలపాకుల సైదులు తయారు చేసిన వివిధ కళాఖండాలను స్థానిక మై హోం పరిశ్రమలోని ఆడిటోరియంలో ప్రదర్శించారు. విద్యార్థులు, కాలనీ వాసులు ఆసక్తిగా తిలకించారు.సైదులును ప్లాంట్ హెడ్ శ్రీనివాసరావు అభినందించి, సత్కరించారు. కార్యక్రమం లో హెచ్ఆర్ హెడ్ నాగేశ్వర్ రావు,హెచ్ఎం పావని, విద్యార్దులు పాల్గొన్నారు.