District SP : సోషల్ మీడియా ప్రభావానికి గురి కావొద్దు.. జిల్లా ఎస్పీ..!
District SP : సోషల్ మీడియా ప్రభావానికి గురి కావొద్దు.. జిల్లా ఎస్పీ..!
సూర్యాపేట, మనసాక్షి
మహిళలు, బాలికల, విద్యార్ధునిల రక్షణకు సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందని వీరి రక్షణలో అనుక్షణం పనిచేస్తున్నామని జిల్లా ఎస్పీ కే నరసింహ తెలిపారు. స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉండడం వల్ల సోషల్ మీడియా ప్రభావం యువత పై అధిక ఉన్నది, దీని ద్వారా మంచిని నేర్చుకోవాలి తప్ప చెడు మార్గంలోకి, చెడు ఆలోచనలోకి వెళ్ళవద్దని అని కోరారు.
18 సంవత్సరాల లోపు వారిపై వేధింపులకు పాల్పడితే ఫోక్సో చట్ట ప్రకారం కఠినమైన కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మహిళలు, విద్యార్థినిల రక్షణలో పోలీస్ శాఖ షీ టీమ్స్, కళా బృందాలతో విద్యాసంస్థల్లో, కాలనీలలో, రద్దీ ప్రాంతాలలో మహిళల రక్షణలో నూతన చట్టాలు, జైలు శిక్షలు అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అన్నారు.
బస్టాండులు, కళాశాలలు, రద్దీ ప్రాంతాలు, షాపింగ్ మాల్స్ సినిమా థియేటర్స్ మొదలగు ప్రాంతాలలో ఆగతాయిలపై నిఘా ఉంచామని చెప్పారు. మహిళలను గౌరవించడం మన సాంప్రదాయమని సమాజంలో మహిళల పురోగతికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మహిళల పట్ల వేధింపులకు పాల్పడితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది హెచ్చరించారు.
పోక్సో కేసులలో కఠినమైన జైలు శిక్షలు పడతాయి అని తెలిపారు. 18 సంవత్సరాల లోపు విద్యార్థులు ఎలాంటి ఆకర్షణలకు లోను కాకుండా చదువుకోవడంపై దృష్టి పెట్టాలని బాగా చదువుకోవాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లల నడవడికపై దృష్టి పెట్టాలని వీరిని గమనించాలి అని ఏమైనా తప్పుడు మార్గంలోకి వెళుతున్నట్లయితే వారిని కౌన్సిలింగ్ ద్వారా సన్మార్గంలోకి తీసుకురావాలని కోరారు.
విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా విద్యాసంస్థల్లో ఆయా యాజమాన్యాలు జాగ్రత్తలు పాటించాలని ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ లాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలీస్ శాఖ సహకారంతో విద్యాసంస్థల్లో యాంటి ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
లా అండ్ ఆర్డర్ పోలీసు మరియు షీ టీం బృందాలు రద్దీ ప్రాంతాలలో బస్టాండ్ కళాశాల నందు నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ఎవరు కూడా మహిళలను విద్యార్థులను వేధింపులకు గురి చేయకుండా ఉండాలని కోరారు.
MOST READ :
-
District collector : ప్రజావాణి కార్యక్రమం రద్దు.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!
-
BIG Alert : వాట్సాప్ ఊహించని షాక్.. ఈ ఫోన్ లలో రేపటి నుంచి పనిచేయదు..!
-
TG News : దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తీర్చి దిద్దుతాం..!
-
Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడు.. వారికి లేదా.. లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu Bharosa : రైతు భరోసా లో కీలక మార్పులు.. బిగ్ అప్డేట్..!









