Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనల్గొండసామాజిక సేవ

సామాజిక సేవలో రెడ్డి – గుత్తా, ఉత్తమ్

సామాజిక సేవలో రెడ్డి – గుత్తా, ఉత్తమ్

మిర్యాలగూడ, మన సాక్షి :

సామాజిక సేవా కార్యక్రమాల్లో రెడ్డి బంధువులు ఉన్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ సభ్యులు నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ రాజ బహదూర్ వెంకట్రాంరెడ్డి విజ్ఞాన కేంద్రానికి శంకుస్థాపన చేశారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక కార్యక్రమాలకు నిర్వచనమే రెడ్డి అన్నారు . నిర్మాణం చేపట్టే విజ్ఞాన కేంద్రం అందరికీ ఉపయోగపడేలా ఉండాలని కోరారు. డి సంక్షేమ సంఘం సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయ్ సింహ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి , ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ,

 

 

రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు అనుముల మధుసూదన్ రెడ్డి, అభ్యాస్ విద్యాసంస్థల చైర్మన్ వంగాల నిరంజన్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ శాగా జయలక్ష్మి జలంధర్ రెడ్డి, ఎంపీడీవో జ్యోతిలక్ష్మి, బిజెపి నాయకులు రేపాల పురుషోత్తం రెడ్డి ,మాలి సోమేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు