Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతరలుతెలంగాణసూర్యాపేట జిల్లా

సోమప్ప దేవాలయంలో రాజకీయ జోక్యం ?

సోమప్ప దేవాలయంలో రాజకీయ జోక్యం ?

సోమప్ప ఆలయం రికార్డింగ్ డ్యాన్సులు, సినిమా పాటలు..?

-9 గంటలకు కళ్యాణం

నేరేడుచర్ల, ఫిబ్రవరి 19, మనసాక్షి:

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం బూర్గుల తండ గ్రామ పంచాయతీ పరిది లోని సోమప్ప ఆలయంలో ఎప్పుడు లేని విధంగా రాజకీయ జోక్యం పెరిగింది. సోమప్ప దేవాలయం వద్ద మహాశివరాత్రి సందర్భంగా జాగారం చేసేందుకు వచ్చిన భక్తులకు భక్తి పాటలు, భక్తి సినిమాలు, ప్రదర్శనలు చేయాల్సిన అక్కడి పాలకమండలి రికార్డింగ్ డ్యాన్సులు, సినిమా పాటలు పెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి.

రాజకీయాల జోక్యం .. సోమప్ప దేవుడి సంప్రదాయాలకు విరుద్ధంగా రాత్రి 9 గంటలకే దేవుని కళ్యాణం చేసి, భక్తులు జాగారలు చేయకుండా రికార్డింగ్ డ్యాన్స్ లు నిర్వహించారు. దాంతో కళ్యాణంకు వచ్చిన భక్తులు ఆలయ పూజరిని అడిగితే అంత మా ఇష్టం అని సమాధానం చెపుతు గుడికి వచ్చిన భక్తులును తిడుతున్నా..ఆరోపణలు వచ్చాయి.

దేవుని కళ్యాణం కి వస్తే భక్తులకు రికార్డింగ్ డాన్స్ లు, సినిమా పాటలతో  ప్రజలు ఆశ్చర్య పోయారు.

మరిన్ని వార్తలు