TG News : మాదకద్రవ్యాల నియంత్రణ పై ప్రత్యేక నిఘా.. ఎక్సైజ్ అకాడమీలో మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీ..!
TG News : మాదకద్రవ్యాల నియంత్రణ పై ప్రత్యేక నిఘా.. ఎక్సైజ్ అకాడమీలో మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీ..!
రాజేంద్రనగర్, మనసాక్షి :
రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆక్మసిక తనిఖీ చేశారు. మంత్రి వెంట ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ, అబ్కారీ శాఖ కమిషనర్ చేవ్వూరు హరికిరణ్ ఉన్నారు. అకాడమీ డైరెక్టర్ అజయ్ రావు, ఇతర అధికారులు మంత్రి జూపల్లికి స్వాగతం పలికారు.
అకాడమీ పనితీరును అధికారులు మంత్రికి వివరించారు. అకాడమీ అంతా కలియతిరిగిన మంత్రి ఆయా విభాగాల పనితీరు తెలుసుకున్నారు. అనంతరం ప్రస్తుతం అకాడమీలో శిక్షణ పొందుతున్న 129 మంది మంది మహిళా ట్రైనీ కానిస్టేబుళ్లతో సంభాషించారు. శిక్షణ తరగతుల్లో చెప్పుతున్న పాఠాలు, ఫిజికల్ ట్రైనింగ్ గురించి చర్చించారు.
అకాడమీలో భోజనం ఎలా ఉందని, నీటి సమస్య ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. అకాడమీలో అందుతున్న సేవలు, అక్కడి సౌకర్యాలు , శిక్షణ తరగతులు, ఇతర అంశాల గురించి శిక్షణ పొందుతున్న ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్స్ ను అడిగి తెలుసుకున్నారు.
ట్రైనీలను ఉద్దేశించి మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న పోటీని తట్టుకుని.. మీరంతా ఎంతో కష్టపడి, స్వయంకృషితో ఈ ఉద్యోగానికి ఎంపికయ్యారని అభినందించారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ట్రైనీ కానిస్టేబుళ్లకు సూచించారు.
సమాజానికి మేలు చేసేలా సేవలు అందించాలని, అంకితభావంతో పని చేయాలని కోరారు. సమాజ శ్రేయస్సుకు మాదకద్రవ్యాల నియంత్రణ ఎంతో ముఖ్యమని, గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం, సారా అమ్మకాలు, రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టి, వాటి బారి నుంచి యువతను కాపాడేందుకు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఉద్బోధించారు.
మాదకద్రవ్యాల సరఫరా, వినియోగించే వారి సమాచారాన్ని తెలుసుకొవడం ద్వారా, వాటి మూలాల నుంచి అరికట్టాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేస్తున్నదని అన్నారు. ఎక్సైజ్ అకాడమీలో సౌకర్యాలు బాగున్నాయని, రానున్న రోజుల్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
MOST READ :
-
Kcr : నేను కొడితే మామూలుగా ఉండదు.. ఫిబ్రవరిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ..!
-
Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్స్ కు భారీ షాక్.. ఫిబ్రవరి నుంచి కొత్త రూల్స్.. మీకు తెలుసా..!
-
CM Revanth : ఫిబ్రవరి 16న పెద్దగట్టు జాతర.. నిధుల కేటాయింపుకు సీఎం రేవంత్ ఆదేశం..!
-
Miryalaguda : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. మొబైల్ ద్వారా నగదు రహిత రైల్వే టికెట్..!
-
Gold Price : మరోసారి షాక్.. పెరిగిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!









