Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Get Together : ఘనంగా పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం..!

Get Together : ఘనంగా పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం..!

శాలిగౌరారం, మనసాక్షి :

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం లోని ఆకారం గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల 1999-2000 సంవత్సరం పదవ తరగతి పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 25 సంవత్సరాల తరువాత వారు ఒకే వేదిక మీద కలుసుకోవడం తో వారి ఆనందానికి అవధులు లేవు.

పాఠశాల లో కలసి చదువుకున్న వారి మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు.ఆనాడు తమకు విద్యాబుద్దులు నేర్పిన పూర్వ ఉపాధ్యాయులు అయిన గంట్ల వెంకట్ రెడ్డి, కందాల జానకి రెడ్డి, కనకాచారి,రవీందర్, మారోజు వేంకటాచారి, ఫౌజియా, శోభ కోటయ్యాలు హాజరై వారు ఎంతో విలువైన అనుభవాలను పంచుకుని ఘనంగా శాలువా, మెమోంటోల తో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కుక్కడపు శ్రీనివాసు, బడేటి రవి, మర్రిపల్లి సింహాద్రి,పెద్ది సైదులు, సుంకరి సైదులు, కుక్కడపు రవీందర్, వలిశెట్టి సైదులు, వలిశెట్టి సంపత్, శ్రీరంగం రవి, తీరుపారి రాంమూర్తి పాల్గొన్నారు.

 

ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర కీలకం

ఆమనగల్లు ప్రతినిధి, మన సాక్షి:

ఆటపాటలు చిలిపి పనులు కష్టం సుఖం ఇలా ఏదైనా కానీ మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ గురువుల మందలింపులు తలుచు కుంటూ ఒకసారి వయసు మరచిపోయి చిన్నపిల్లల కేరింతలతో ఆదివారం ఆమనగల్లు పట్టణంలోని బిఎన్ఆర్ గార్డెన్ కోలాహాలంగా మారింది.

పూర్వ విద్యార్థులు అడుగు పెడుతూనే తమ హెూదాలను మరచి ఒకరి నొకరు ఆత్మీయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని స్పందన కోచింగ్ సెంటర్లో 2001-2002 పదవ తరగతి కలిసి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం బిఎన్ఆర్ గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు.

ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా అమ్మవారి శివలింగం చాంద్ పాషా పాల్గొన్నారు. పాల్గొన్న ఉపాధ్యాయులకు శాలువాతో సత్కరించారు. సుమారు 23 సంవత్సరాల తర్వాత ఇక్కడికెక్కడికో వెళ్లినవారు కొందరు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారు కొందరు. ఉద్యోగాల్లో కొందరు వివిధ హెూదాల్లో జీవిస్తూ తమ మిత్రులను కలవాలని తలంపుతో ఆనాటి విద్యార్థులైన కొంతమంది విద్యార్థులకు ఆలోచన కలిగింది.

ఈ సమ్మేళనంలో తమ గురువుల బోధనలు తమ కుటుంబ పరిస్థితులు నాటి చిలిపి తో చేస్తున్న అల్లరి క్రమశిక్షణ పేరుతో గురువుల దండనలు తలుచుకుంటూ సాగిన పూర్వ విద్యార్థుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. చిన్నతనంలో తమకు విద్యాబోధన నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వరికుప్పల నిరంజన్, ఎర్రఓలు రాజు, సంతోష్, చిరంజీవి, మల్లేష్, నాగిళ్ల రాఘవేందర్, మాజీద్ పాషా, చంద్రకళ, గీత, పాల్గొన్నారు.

MOST READ :

  1. Tea : టీ తో బిస్కెట్ కలిపి తింటున్నారా.. అయితే ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే..!

  2. Rythu Bharosa : రైతు భరోసా లో కీలక మార్పులు.. బిగ్ అప్డేట్..!

  3. Number Plates : నెంబర్ ప్లేట్ మార్చడం తప్పనిసరి.. దగ్గర పడుతున్న మార్చే గడువు..!

  4. BIG Alert : వాట్సాప్ ఊహించని షాక్.. ఈ ఫోన్ లలో రేపటి నుంచి పనిచేయదు..!

  5. WhatsApp : వాట్సాప్ లో కొత్త ఫీచర్ ఇక టైపింగ్ లేదు.. మాట్లాడొచ్చు..!

మరిన్ని వార్తలు