హనుమంత సేవ వాహనంపై శ్రీనివాసుడి ఊరేగింపు

హనుమంత సేవ వాహనంపై శ్రీనివాసుడి ఊరేగింపు

మేడ్చల్ మల్కాజిగిరి , మనసాక్షి : దక్షిణ తిరుపతిగా పిలువబడే అల్వాల్ శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం దేవుని అల్వాల్ లో శ్రీవారి బ్రహ్మోత్సవాలలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆరవ రోజు ఆదివారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించి అనంతరం పల్లకి సేవలో స్వామివారిని పుర:వీధులలో ఊరేగించారు. సాయంత్రం హనుమంత సేవ వాహనంపై స్వామివారిని ఊరేగించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో సాంస్కృత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి నరేందర్ మాట్లాడుతూ…

భక్తుల కోర్కెలను తీరుస్తూ ప్రతినిత్యం పూజ, నైవేద్య సేవా కార్యక్రమాలను పొందుతూ, భక్తులకు ఆయురారోగ్య, ఐశ్వర్యాలను, సంతాన సౌభాగ్యాలను ప్రసాదిస్తూ భక్తులకు కొంగుబంగారమై శ్రీవారిని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, ఉత్సవ కార్యక్రమాలు తిలకించి, తీర్థప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమం బీట్కూరు సంపతాచార్యులు, ఆస్తాన పురోహితులు రఘు పంతులు, వంశీ పంతులు, శ్రీనివాస పంతులు, ఆలయ సిబ్బంది నరసయ్య, క్లర్క్ నరేష్, శివరామకృష్ణ, నాగరాజు, వంశీ, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.