సూర్యాపేట : శ్రీరామనవమి వేడుకల్లో మంత్రి జగదీశ్ రెడ్డి
శ్రీరామనవమి వేడుకల్లో మంత్రి జగదీశ్ రెడ్డి
విద్యానగర్ లో కన్నులపండువగా సీతారాముల కళ్యాణం
పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
సూర్యాపేట , మనసాక్షి
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ బేబిమూన్ పాఠశాల వద్ద నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణం వేడుకలను నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీలకు అభినందనలు తెలిపారు. ఎక్కువగా విద్యావంతులు, వ్యాపారులు వుండే విద్యానగర్ నందు అన్ని పండుగలను ఐకమత్యంతో నిర్వహించుకోవడం హర్షణీయమని అన్నారు.
ఉత్సవ కమిటీ సభ్యులు బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ చిలుముల శ్రీనివాస రెడ్డిలకు మంత్రి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించిన బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి పావని క్ర్రపాకర్ కు మంత్రి అభినందనలు తెలిపారు.
వాసవి యూత్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు, వాంకుడోతు పద్మ వెంకన్న, రాచకొండ శ్రీనివాస్, బజ్జూరి శ్రీనివాస్, తెరటపల్లి సతీష్, బెజగం ఫణి,
వంగవీటి రమేష్, జూలకంటి నాగరాజు, యామా సంతోష్, శ్రీరంగం రాము, గుమ్మడవెళ్లి శ్యామ్ సుందర్, మంచాల శ్రీనివాస్ గుప్త, మిట్టపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.









