Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం
శ్రీరామ శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి
శ్రీరామ శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి
తణుకు :
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శ్రీరామనవమి ఉత్సవ ఉత్సవాల్లో ఆపశృతి ఏర్పడింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో శ్రీరామనవమి వేడుకలకు భక్తులు తాటాకులతో చలువ పందిరి ఏర్పాటు చేశారు.
కాగా తారాజువ్వ పందిరిపై పడటం కారణంగా మందిరికి నిప్పు అంటుకొని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆలయంలో ఈ ఘటన జరగడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు.
ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాగా భక్తులతో కలిసి స్థానికులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.









