సెయింట్ జాన్స్ లో ఘనంగా వీడ్కోలు
సెయింట్ జాన్స్ లో ఘనంగా వీడ్కోలు
మిర్యాలగూడ, మనసాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని సెయింట్ జాన్స్ హై స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి మండల విద్యాధికారి బాలాజీ నాయక్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. విద్యతో పేదరికాన్ని తొలగించవచ్చని ఆయన పేర్కొన్నారు.
విద్యను ఉన్నత స్థాయిలో అందిస్తూ మిర్యాలగూడ పట్టణంలో నెంబర్ వన్ విద్యాసంస్థగా పేరుగాంచి..
విద్యార్థులకు ఉత్తమ బోధన సెయింట్ జాన్స్ చేస్తుందన్నారు. విద్యార్థులకు అకాడమిక్ పరీక్షలతో పాటు పోటీ పరీక్షల్లో కూడా వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలిపేందుకు సెయింట్ జాన్స్ ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారన్నారు.
కార్యక్రమంలో సెయింట్ జాన్స్ పాఠశాల ప్రిన్సిపాల్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి, జిహెచ్ఎం లు అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి, అరుణకుమారి, లక్ష్మణ్, వెంకన్న ,గోపి, కరస్పాండెంట్ అలుగుబెల్లి శిరీష, తదితరులు పాల్గొన్నారు.











