విద్య కోసం విద్యార్థికి “మాటా” చేయూత

విద్య కోసం విద్యార్థికి “మాటా” చేయూత

రూ. 30 వేల ఆర్థిక సహాయం అందజేత

మిర్యాలగూడ, అక్టోబర్ 19, మన సాక్షి : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఇంటర్ చదువుతున్న పేద విద్యార్థి ఎస్.కె నుమాన్ కు విద్య ఖర్చుల గాను రూ. 30,000 వేల ఆర్థిక సహాయం మిన్నేసోటా ఏరియా తెలంగాణ అసోసియేషన్ (మాటా) ప్రతినిధులు కొప్పుల ప్రణీత్ రెడ్డి, రేగట్టి సౌమ్యారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం అందజేశారు.

స్థానిక అరోరా జూనియర్ కళాశాల లో జరిగిన కార్యక్రమంలో మన మిర్యాలగూడ ఆర్గనైజేషన్ ప్రతినిధులు హెన్రీ మోసెస్, పవన్ కుమార్ చేతుల మీదుగా విద్యార్థి కుటుంబ సభ్యులకు నగదు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో విద్యార్థి ఉన్నత చదువులకు సైతం ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు.

పేద విద్యార్థికి సాయం అందించిన మాటా ప్రతినిధులకు మన మిర్యాలగూడ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు మన్యం శ్రీధర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మనోహర్, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.