విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి – మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్

విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

– మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్

తుంగతుర్తి, జనవరి 20 మన సాక్షి

విద్యార్థులు తమ భయాందోళనల్ని విడిచి పెట్టి సంపూర్ణ మైన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చునని, ఈనాటి వైజ్ఞానిక సమాజంలో మారుతున్న సాంకేతికతను అర్థం చేసుకొని విద్యార్థులు ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు.

మండల పరిధిలోని వెలుగుపల్లి ప్రాథమిక పాఠశాలలో టిఆర్టియు రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం పిఆర్టియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి విద్యార్థులకు పలకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పూల రవీందర్ మాట్లాడుతూ…

విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి మంచిస్థాయికి చేరుకోవాలని సూచించారు.ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్‌ ఉజ్వలమవుతుందన్నారు. దాతలు ఇస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కమలాకర్ రావు, ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి, డిసిఎంఎస్ డైరెక్టర్ గుడిపాటి సైదులు,యాదాద్రి,సూర్యాపేట జిల్లాల పి ఆర్ టి యు అధ్యక్ష కార్యదర్శులు రామ్మోహన్ రావు, ధర్మారపు వెంకటయ్య,చంద్రశేఖర్ రామలింగారెడ్డి, మండల విద్యాధికారి బోయిని లింగయ్య, పిఆర్టియు మండల అధ్యక్షులు ఎర్ర హరికిషన్, చంద్రశేఖర్ ,రవీందర్, మధు, కాజా సాబ్, రవీందర్, సత్యనారాయణ, సురేందర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లెపాక రాములు, పాలడుగు జలంధర్, సోమేశ్, కమలాకర్, యాదగిరి, ప్రసాద్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.