Students : విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలి..!

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు.

Students : విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలి..!

పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం..

ప్రధానోపాధ్యాయులు రహీమొద్ధీన్

కంగ్టి, మన సాక్షి :-

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎండీ రహీమొద్ధీన్ మాట్లాడుతూ..

పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత ఫలితాలు సాధించి భవిష్యత్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఒక వ్యక్తి తాను కన్నా కళలను సహకారం చేసుకోవాలంటే 10వ తరగతి విద్యతోనే సాధ్యమవుతుందన్నారు. బాగా కష్టపడి తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు పలికారు.

అనంతరం సంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బండారి మహేష్, నరేందర్, రాధిక,రవిచంద్, సంతోష్,పుష్పలత, అంజన అశోక్,వెంకటలక్ష్మి, ఆసిఫ్ అలీ, ఫర్జానా , సమీర్, శివాజీ, చందర్, గోవింద్, ధనలక్ష్మి, సీఆర్పీలు తులసిరాం, సంజీవ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Reporters Arrest : విలేకరుల బ్లాక్ మెయిల్.. కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు అరెస్టు, పరారీలో ముగ్గురు..!