ఒకే గదిలో ఇద్దరు హాస్టల్ విద్యార్థినిలు ఆత్మహత్య..!

యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యార్థినిల ఆత్మహత్య కలకలం రేపింది. భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్‌లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం రాత్రి ఇద్దరు విద్యార్థినిలు ఒకే గదిలో చున్నీలతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఒకే గదిలో ఇద్దరు హాస్టల్ విద్యార్థినిలు ఆత్మహత్య..!

భువనగిరి , మన సాక్షి :

యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యార్థినిల ఆత్మహత్య కలకలం రేపింది. భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్‌లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం రాత్రి ఇద్దరు విద్యార్థినిలు ఒకే గదిలో చున్నీలతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

తోటి విద్యార్థులు గమనించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపు వారు చనిపోయారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థులు భవ్య , వైష్ణవిగా గుర్తించారు. ఇద్దరు ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో పట్టణం ఒకసారిగా ఉలిక్కిపడింది.

ALSO READ: Telangana : తెలంగాణలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. నిబంధనలు ఇవేనా..!

ఎస్సీ బాలికల హాస్టల్ లో ఉంటున్న ఈ విద్యార్థినిలు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నారు. వీరి తల్లిదండ్రులు హైదరాబాదులో నివాసం ఉంటారు. ఇరువురు ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ నోట్ రాయటం కలకలం రేపింది. అంతసేపు తమతో కలిసి ఉన్న విద్యార్థినులు ఒకేసారిగా ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థులు అంతా శోకసంద్రంలో మునిగిపోయారు.

వీరిద్దరూ ఒకేసారి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే విషయం పోలీసులు విచారణ చేస్తున్నారు. పరీక్షలు అంటే భయపడి ఆత్మహత్య చేసుకున్నారా ..? లేక ఇంక వేరే కారణాలవల్ల ఆత్మహత్య చేసుకున్నారా? అనే విషయాన్ని పోలీసులు విచారణ చేస్తున్నారు. హాస్టల్ విద్యార్థుల అంతా భయాందోళనలకు గురవుతున్నారు. ఈ సంఘటన సంచలనం రేపింది.

ALSO READ : Nalgonda : మెడికల్ షాపులలో మత్తు టాబ్లెట్లు, ఇంజక్షన్లు.. సిగరెట్ పెట్టెలలో పెట్టి అధిక ధరలకు విక్రయం..!