పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

రామసముద్రం , మనసాక్షి :

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం మండలం లోని చెంబకూరు లో చోటుచేసుకుంది.కుటుంబ సభ్యుల వివరాల మేరకు చెంబకూరు కోట వీధికి చెందిన బండారి బయన్న 55 గత మూడురోజుల క్రితం ఇల్లు విడిచి వెళ్ళాడు.

కుటుంబ సభ్యులు ఎంత వెతికిన బయన్న ఆచూకీ లభ్యం కాలేదు.ఈనేపథ్యంలో కర్ణాటక బార్డర్ నందు సోమయాజులపల్లె గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ పొలంలో బుధవారం బయన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.బయన్న ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.