Miryalaguda : నేను పొద్దుతిరుగుడు పువ్వు అయితే .. కాంగ్రెస్ ఏంటి ..?  గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Miryalaguda : నేను పొద్దుతిరుగుడు పువ్వు అయితే .. కాంగ్రెస్ ఏంటి ..?  గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

మిర్యాలగూడ,  మన సాక్షి:

నేను పొద్దుతిరుగుడు పువ్వు అయితే పూటకో పార్టీతో పొత్తు పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఏంటిదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు .

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎల్పీ నేత భట్టి విక్రమార్క గమనం ,గమ్యం, లేని నాయకుడు నాయకుడన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం కోసం రోజుకు 3 కిలోమీటర్లు భట్టి పాదయాత్ర చేస్తున్నారన్నారు. భట్టి పాదయత్రకి ప్రజల నుండి ఎలాంటి స్పందన లేదని. నిన్న నల్గొండ క్లాక్ టవర్ దగ్గర జరిగిన సభలో కేవలం 150 మంది మాత్రమే పాల్గొన్నరని ఆయన చెప్పారు.

 

బట్టి విక్రమార్కవి వట్టి మాటాలు మాత్రమేనని , చీఫ్ పబ్లిసిటీ కోసం తన పైనా ,మంత్రి జగదీష్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎస్ ఎల్ బి సి లో లెవల్ కెనాల్ పూర్తి చేసి నీళ్లు ఇస్తున్నామని, ఫ్లోరిన్ ప్రాంతాలకు నీటిని అందించేందుకు డిండి ప్రాజెక్టు ను పూర్తి చేశామన్నారు .

 

Also Read : Whatsapp Multi Account : వాట్సప్ అదిరిపోయే మల్టీ ఎకౌంటు ఫీచర్..!

 

పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికాకుండా గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేసి స్టే లు తీసుకొని వచ్చిన దుర్మార్గులు కాంగ్రెస్ నేతలన్నారు. ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టు పూర్తికావొస్తుందని , ఇంకా కేవలం 9 కిలోమీటర్లు వర్క్ మాత్రమే మిగిలి ఉందన్నారు.

 

ఈ ప్రాంతానికి ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కండ్లున్న కాబోది అయ్యారని .ఆయనకు గతంలో నేను చేసిన అభివృద్ధి, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు ఏం కనబడటం లేదన్నారు.నల్గొండ ఎంపీగా గత నాలుగు సంవత్సరాలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రం నుండి ఏం సాధించుకొని తెచ్చారో చెప్పాలన్నారు.

 

Also Read : RRB Recruitment : 10th అర్హతతో రైల్వే ఉద్యోగాలు.. ఈనెలాఖరులోగా దరఖాస్తులు..!

 

ఒక్క పని అయిన ఇది చేసిన అని చెప్పే ధైర్యం ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క లు ఒక్కరోజు కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం చేయలేదని, వీరందరూ తెలంగాణ ద్రోహులని ఆయన అన్నారు.

 

నేను పది సంవత్సరాలలో ఏం సాధించాను అని బట్టి అంటున్నారని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పది సంవత్సరాలు కోట్లాడి,తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న అని,అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి కి కృషి చేశానని , జాతీయ రహదారులు ,2 కేంద్రీయ విద్యాలయాలు సాదించిపెట్టినను అని ఆయన చెప్పారు.

 

తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకుల సమూహం కాంగ్రెస్ పార్టీ నని ఆయన విమర్శించారు. ఆంధ్ర నాయకులకు సంచులు మోసిన వారు నేడు మాపై ఆరోపణలు చేస్తున్నారని గుత్తా మండిపడ్డారు. బి ఆర్ యస్ పార్టీ ఏం చేసిందో ప్రజలను అడగాలని, వారే చెబుతారని అన్నారు. ఆనాడు వైయస్సార్ ఆహ్వానం మేరకు, ప్రస్తుతం కెసీఆర్ ఆహ్వానం మేరకు ఆయా పార్టీల్లో చేరానని సుఖేందర్ రెడ్డి చెప్పారు.

 

Also Read : TSRTC : టిఎస్ ఆర్టీసి ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. రూ .100 తో 60 కిలోమీటర్లు రాను పోను..!

 

నేను పొద్దుతిరుగుడు పువ్వు లాంటి వాణ్ణి అయితే పూటకు ఒక పార్టీతో పొత్తు పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఏమి అవుతుందో చెప్పాలన్నారు. భట్టి విక్రమార్క వైఖరి గురి గింజ సమేత ను గుర్తు చేస్తోందన్నారు. గత తొమ్మిది సంవత్సరాలలో కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, డిండి, ప్రాజెక్టులను పూర్తి చేసి నీటిని అందించిన ఘనత మా ప్రభుత్వానిది దక్కిందన్నారు .

కేవలం కాలువలు తవ్వి కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన తెలిపారు. మాకు ఒక్కడే నాయకుడని- ఒక్కటే ఎజెండా అని కానీ కాంగ్రెస్ బిజెపి పార్టీలకు ఆ పరిస్థితి లేదు అని చెప్పారు. ఢిల్లీ నేతల అనుమతి లేనిది తెలంగాణ కాంగ్రెస్ నేతలు అడుగు తీసి అడుగు వెయ్యలేరని,కాంగ్రెస్ నేతలు అసమర్థులు కాబట్టి ఢిల్లీ వైపు చూస్తున్నారని, కేసీఆర్ గారు సమర్ధుడు కాబట్టి ఢిల్లీనే ఆయన వైపు చూస్తోందన్నారు.

 

బిజెపి నేత విద్యాసాగర్ రావు హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అనడం సబబు కాదని, కేంద్రం పెత్తనం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాదించుకోలేదన్నారు. రెండో రాజధాని ఉత్తర భారతదేశంలో పెట్టుకోవలని, లెఫ్ణినెంట్ గవర్నర్ పెత్తనం మాకు అక్కరలేదని ఆయన అన్నారు.

 

Also Read : GPay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే హ్యాకర్లు హ్యాక్ చేయకుండా ఏంచేయాలి..? తెలుసుకుందాం .. !

 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పూటకో మాట మాట్లాడు తారని, ఆయన స్థిమితంలేని నాయకుడని గుత్తా అన్నారు. నల్గొండ జిల్లాలో 12 స్థానాల్లో 12 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ పగటి కలలు కంటుందని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి,మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, తదితరులు పాల్గొన్నారు.