Breaking Newsజిల్లా వార్తలురాజకీయంసూర్యాపేట జిల్లా
Suryapet : బిజెపి పట్టణ అధ్యక్షులుగా బూర మల్సూర్ గౌడ్..!
బిజెపి పట్టణ అధ్యక్షులుగా బూర మల్సూర్ గౌడ్ నియమితులయ్యాలరు. ఈమేరకు బిజెపి జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నియామకం పత్రం అందజేశారు.

Suryapet : బిజెపి పట్టణ అధ్యక్షులుగా బూర మల్సూర్ గౌడ్..!
సూర్యాపేట, మనసాక్షి :
బిజెపి పట్టణ అధ్యక్షులుగా బూర మల్సూర్ గౌడ్ నియమితులయ్యాలరు. ఈమేరకు బిజెపి జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నియామకం పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణ అభివృద్ధి కోసం నిత్యం అందుబాటులో ఉంటూ కృషి చేస్తానని, పార్టీ బలోపేతానికి ఆహర్నిశలు పాటుపడతానని తెలిపారు.
తన నియామకానికి కృషిచేసిన మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర నర్సయ్య గౌడ్, మాజీ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడియం రామచంద్రయ్య, బొబ్బ భాగ్యరెడ్డి, కవితా రెడ్డి, రాష్ట్ర నాయకులు టి, మన్మధ రెడ్డి, రంగరాజు రుక్మారావు, తోటిపల్లి రవి లకు కృతజ్ఞతలు తెలిపారు.









