సూర్యాపేట : సుందరికరణ పనులను వేగవంతం చేయాలి
సుందరికరణ పనులను వేగవంతం చేయాలి
సూర్యాపేట జిల్లా కలెక్టర్ యస్ . వెంకట్రావు
సూర్యాపేట , మనసాక్షి
మినీ ట్యాంక్ బండ్ సుందరికరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పుల్లారెడ్డి చెరువు పై నిర్మిస్తున్న రెండవ మినీ ట్యాంక్ బండ్ పనులను జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాదాన్ని ఇచ్చేందుకు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పుల్లారెడ్డి చెరువు సుందరికరణ కొరకు రూ.20కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రజలకు ఆహ్లాదం తో పాటు పచ్చదనం ఉట్టిపడేలా ట్యాంక్ బండ్ నిర్మాణాన్ని చేపట్టాలన్నారు.
పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్ మోహన్ రావు, మున్సిపల్ కమిషనర్ రామానుజ రెడ్డి, ఆర్డీవో రాజేంద్ర కుమార్, తాసిల్దార్ వెంకన్న ఆర్ఐలు శ్రీధర్ ,శివరాంరెడీ, సిబ్బంది పాల్గొన్నారు









