Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

సూర్యాపేట : తప్పుడు రక్త పరీక్ష , బాధితుడు ఆందోళన

సూర్యాపేట : తప్పుడు రక్త పరీక్ష  బాధితుడు ఆందోళన

డయాగ్నస్టిక్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలి అని వినతి

సూర్యాపేట , మనసాక్షి :

తప్పుడు రిపోర్టు ఇచ్చిన జనని డయాగ్నస్టిక్ సెంటర్ పై జిల్లా వైద్యాదికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు వట్టే గంగరాజు అన్నారు.

 

శనివారం గాంధీనగర్ కు చెందిన వట్టే గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు ఉదయం 7:30కి షుగర్ పరీక్షల నిమిత్తం జననీ డయాగ్నస్టిక్ సెంటర్ కు షుగర్ పరీక్షకోసం తినక ముందు, ఆహారం తీసుకున్న తర్వాత షుగర్ పరీక్ష టెస్టుకు ఇచ్చామన్నారు.

 

అయితే షుగర్ 236 ఉంది రిపోర్టు రావడంతో భయంతో విజయ డయాగ్నస్టిక్ సెంటర్ కు వెళ్లాననీ, అయితే అక్కడ ఇచ్చిన రక్తపరీక్షల్లో షుగర్ 91,నార్మల్ అని చూపించడంతో ఇది నిజమో కాదు అని రాఘవేంద్ర డయాగ్నస్టిక్ సెంటర్ లో మళ్లీ టెస్టులు చేయించామన్నారు

 

 

అందులో కూడా 103 అని తేలడంతో జననీ డయాగ్నస్టిక్ సెంటర్ కు వచ్చి తప్పుడు రిపోర్టు ఎందుకు ఇచ్చారని అడగగా అక్కడ ఉన్న సిబ్బంది నిర్లక్ష్య వైఖరితో సమాధానం చెప్పకపోవడంతో మీడియాను ఆశ్రయించడం జరిగిందని అన్నారు.

 

అయితే ఈ విషయంపై ల్యాబ్ సిబ్బంది నగేష్ ను వివరణ అడగగా రిపోర్టు వేరే గంగరాజుది ఆయనకు ఇవ్వబోయి ఇతనికి ఇచ్చామని అన్నారు. అయితే అతని టెస్టులు తీసుకురమ్మని అడగగా వారు తీసుకురాకపోవడంతో చివరికి పొరపాటు జరిగిందని చెప్పడంతో బాధితున్ని ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయమని బ్రతిమాలడనీ బాధితుడు చెప్పారు.

 

ఏది ఏమైనా వైద్యాధికారులు రక్త పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి ఇలాంటి పొరపాట్లు మళ్లీ ఎవరికి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి పొరపాట్లు జరగడం వలన పేద ప్రజలు నష్టపోయే అవకాశం ఉందని,ఇది మెడికల్ మాఫియాగా తయారయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు