వలిగొండ : రైలు పట్టాలపై తలపెట్టిన యువకుడు

వలిగొండ : రైలు పట్టాలపై తలపెట్టిన యువకుడు

వలిగొండ , మన సాక్షి:

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నాగారం గొల్లేపల్లి గ్రామాల మధ్య రైలు పట్టాలపై శనివారం మృతదేహం కనుగొన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు గొల్లెపల్లి గ్రామానికి చెందిన నామ పృద్వి (24) గా గుర్తించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

 

మృతదేహాన్ని నల్లగొండకు తరలించి కేసు నమోదు చేశామని రైల్వే పోలీసులు తెలిపారు మృతుడు ఆత్మహత్యకు గల కారణాలు ఆర్థిక లావాదేవీలు కావచ్చని, ఇటీవల మృతుని తండ్రి కూడా మరణించడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు తెలిపారు.