TOP STORIESBreaking Newsఉద్యోగంసంగారెడ్డి జిల్లా
Talent : గ్రూప్ – 4 లో ప్రతిభ.. మూడు ఉద్యోగాలకు అర్హత సాధించిన యువకుడు..!
Talent : గ్రూప్ – 4 లో ప్రతిభ.. మూడు ఉద్యోగాలకు అర్హత సాధించిన యువకుడు..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల నగన్ పల్లి గ్రామానికి చెందిన కొండగల్ శ్రీకాంత్ గ్రూప్ -4 ప్రతిభ కనబరిచారు. గ్రూప్ 4 లో ప్రతిభ కనబరిచిన శ్రీకాంత్ గతంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించి, ప్రస్తుతం టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం టీజీపీఎస్ ప్రకటించిన ఫలితాల్లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు ఉద్యోగులకు అర్హత సాధించడం జరిగిందన్నారు. న్యాల్కల్ మండలం ముర్తంజపూర్ నందలి ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నానన్నారు. శ్రీకాంత్ ని తల్లిదండ్రులు కొండగల్ వాడి మహాదేవి, తుకారం, మరియు స్నేహితులు బంధువులు గ్రామస్తులు అభినందిస్తున్నారు.
MOST READ :









