టీడీపీ జెండా దిమ్మెకు బిఆర్ఎస్ రంగు..!
టీడీపీ జెండా దిమ్మే కు బిఆర్ఎస్ రంగు..!
అడ్డుకున్న టీడీపీ నాయకులు
నడిగూడెం, మన సాక్షి :
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో వేణుగోపాలపురం గ్రామంలో టీడీపీ జెండా దిమ్మేకు బిఆర్ఎస్ నాయకులు గులాబీ రంగు వేసిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.
విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేయడంతో అప్పటికి అప్పుడు జెండా దిమ్మే నిర్మాణం చేయలేకనో, తెలంగాణ రాష్ట్రములో టీడీపీ పార్టీకి ఆదరణ లేదు అనుకున్నారో ఏమో కానీ బిఆర్ఎస్ నాయకులు అత్యుత్సాహం తో టీడీపీ జెండా దిమ్మే కు గులాబీ రంగు వేస్తున్నారు.
విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు అడ్డుకోవడం జరిగింది. టిడిపి పార్టీని అవమానపరిచే విధంగా వ్యవహరించిన వారిపై చట్టా పరమైన చర్యలు తీసుకోవాలని జరిగిన సంఘటనపై మండల టిడిపి నాయకులు నడిగూడెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. బిఆర్ఎస్ ఆగడాలకు రోజులు దగ్గర పడ్డాయని మండల టిడిపి నాయకులు హెచ్చరించారు.









