Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం
First List : టిడిపి, జనసేన ఫస్ట్ లిస్ట్ ఇదే..!
First List : టిడిపి, జనసేన ఫస్ట్ లిస్ట్ ఇదే..!
అమరావతి , మన సాక్షి :
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ – జనసేన పార్టీ ఫస్ట్ లిస్ట్ అభ్యర్థులను ప్రకటించింది. శనివారం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి అభ్యర్థుల ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీ 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
రాబోయే ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ మొదటి విడత విడుదల చేసిన 94 మంది జాబితాలో సీనియర్లకు చాలామందికి అవకాశం కల్పించలేదు.
కొంతమందికి వైసీపీ నుంచి టిడిపిలో చేరిన వారికి కూడా టికెట్లు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు 24 టికెట్లు కేటాయించగా పవన్ కళ్యాణ్ ముందుగా ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.












