Suryapet : మాజీ మంత్రి దామన్న కు కన్నీటి వీడ్కోలు.. తరలివచ్చిన అభిమానులు, నాయకులు..!

Suryapet : మాజీ మంత్రి దామన్న కు కన్నీటి వీడ్కోలు.. తరలివచ్చిన అభిమానులు, నాయకులు..!
సూర్యాపేట, మనసాక్షి :
దివంగత మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు శనివారం సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని దామోదర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.
మంత్రులు, ప్రముఖులు నాయకులు పార్టీలకతీతంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి దివంగత నేతకు ఘన నివాళులర్పించారు. ప్రజల కడసారి సందర్శనార్థం రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పార్థివ దేహాన్ని తుంగతుర్తి లోని వారి వ్యవసాయ క్షేత్రం లో ఉంచారు.
రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ, వృద్ధులు, వికలాంగుల సంక్షేమ శాఖ, ఇన్చార్జి మంత్రివర్యులు అడ్లురు లక్ష్మణ్ కుమార్, పీసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ లు దివంగత నేత దామోదర్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డిని, కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎంపీ రఘు వీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మందుల సామేలు, ఉత్తమ్ పద్మావతి రెడ్డి, జగదీశ్ రెడ్డి, బి లక్ష్మారెడ్డి , అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం, యశస్విని రెడ్డి,
ఎమ్మెల్సీ శంకర్ నాయక్, అగ్రికల్చర్ కమిషన్ మెంబర్లు రాంరెడ్డి గోపాల్ రెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, మాజీ ఎంపీ హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్,ఇతర ప్రముఖులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి పార్థివ దేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.
దివంగత నేత ను చివరి చూపు చూసేందుకు ప్రజలు, అభిమానులు తండోపతండాలుగా వచ్చి నివాళులు అర్పించారు. అనంతరం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. నివాళులు అర్పించిన వారిలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్ పి కే నరసింహ, ఆర్డీఓ వేణుమాధవ్ తదితరులు ఉన్నారు.
MOST READ NEWS :
-
Miryalaguda : రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోశాధికారి గందె రాముకు ఘన సన్మానం..!
-
Tea Snacks : టీతో ఈ స్నాక్స్ కలిపి తినకూడదు.. కారణం ఏంటంటే..!
-
Groups : పేదరికాన్ని జయించిన తాహేర బేగం.. గ్రూప్-1 లో ప్రతిభ, ఎంపీడీవో గా ఉద్యోగం..!
-
Suryapet : మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత..!
-
Nalgonda : నల్గొండ జిల్లాలో పండుగ పూట విషాదం.. బాలుడిని కాపాడబోయి ఇద్దరు యువకుల మృతి, బాలుడు గల్లంతు..!










