మిర్యాలగూడ : దేశానికే తెలంగాణ దిక్సూచి – ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ : దేశానికే తెలంగాణ దిక్సూచి – ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ, మన సాక్షి:

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిలా ఉందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మిర్యాలగూడ పట్టణం నందిపహాడ్ బైపాస్ సమీపంలోని శ్రీమన్నారాయణ గార్డెన్స్ లోతెలంగాణ సంక్షేమ సంబురాలు నిర్వహించారు.

 

కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు హాజరయ్యారు .. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ ఆసరా పెన్షన్ల నుంచి మొదలు అన్ని రంగాల్లో సంక్షేమం ఆకాశం అంత విస్తరించి దేశానికే తెలంగాణ దిక్సూచి లా నిలుస్తున్నదని, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, గురుకుల విద్యాలయాలు, ఉచిత విద్యుత్, గొర్ల పంపిణి, చేపల పంపిణి ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో సంక్షేమ పధకాలను బడుగు బలహీన వర్గాలకు అమలు చేస్తున్నదని అన్నారు. ఇక రెండోసారి అధికారంలోకి వచ్చాక గత సంక్షేమ పధకాలను కొనసాగిస్తూనే, దేశంలో ఎవరికీ సాద్యం కాని కొత్త పధకాలకు శ్రీకారం చుట్టిందన్నారు.

 

ఎస్సీ ల అభివృద్ధి కోసం దళిత బంధు పధకానికి శ్రీకారం చుట్టింది. షరతులు లేకుండానే స్వయం ఉపాది కల్పించేలా రూ. 10 లక్షల ఆర్దిక సహాయాన్ని అందజేస్తున్నది.. రజకులకు నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ తదితర పధకాలను శ్రీకారం చుట్టింది.. 41 బీసీ కులాలకు ఆత్మ గౌరవ భవనాలను, స్థలాలను కేటాయించడం తో పాటు, భవన నిర్మాణానికి రూ. కోటి చొప్పున నిధులను కేటాయించింది. ప్రతి వర్గానికి ఏదో ఒక లబ్ది చేకూర్చేలా పధకాలను రూపొందించి అమలు చేసున్నదని తెలిపారు.

 

అనంతరం చేతివృత్తులకు చెయుతే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ బి.సిల్లోని కులవృత్తులకు కుటుంబానికి లక్ష చొప్పున ఆర్దిక సహాయం అందజేయు పధకాన్ని ప్రారంభించగా ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో బి.సి కార్పొరేషన్ ద్వారా కుటుంబానికి లక్ష చొప్పున 6 కుటుంబాలకు మంజూరు ఐన చెక్కులను పంపిణి చేసారు.

 

 

రెండో విడత గొర్రెల పంపిణి పధకం లో భాగంగా 24 కుటుంబాలకు గొర్రె పిల్ల యూనిట్లను లబ్దిదారులకు పంపిణి చేసారు.

 

సొంత స్థలం ఉన్నవారికి ఇళ్ళు కట్టుకునేందుకు ఆర్థికసాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన గృహలక్ష్మి పథకం ద్వారా మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా 15 మంది కుటుంబాలకు ఆర్దిక సహాయాన్ని అందజేసారు.

 

ALSO READ : Good News : వెనుకబడిన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సహాయం.. ! దరఖాస్తు చేసుకోండిలా…!

 

కులాంతర వివాహం చేసుకున్న 15 జంటలకు 2,50,000 రూపాయల చొప్పున 15 మంది జంటలకు చెక్కులను అందజేసారు.

 

తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మక పథకం కళ్యాణ లక్ష్మీ &షాది ముబారక్ ద్వారా మిర్యాలగూడ నియోజక వర్గ వ్యాప్తంగా 218 మందికి మంజూరైన 2 కోట్ల 18 లక్షల 25 వేల 288 రూపాయల విలువ గల (1. మిర్యాలగూడ టౌన్ & మిర్యాలగూడ మండలం-109 మందికి 2. దామరచర్ల మండలం-7 మందికి 3.అడవిదేవులపల్లి మండలం-13 మందికి 4. మాడ్గులపల్లి మండలం-8 మందికి 5.వేములపల్లి మండలం- 81 మందికి) చెక్కులను కలిసి లబ్దిదారులకు పంపిణి చేసారు.

 

ALSO READ : ATM CARD | ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా .. బ్యాంకు కొత్త సర్వీస్.. ఎలా చేయాలో తెలుసుకుందాం..!

 

మైనారిటీ కార్పొరేషన్ ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా 43 మందికి చెక్కులను మరో వారం రోజుల లోగ పంపిణి చేయనున్నట్టు తెలిపారు.

 

ఈ కార్యక్రమములో తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు కుందూరు వీరకోటి రెడ్డి, డీ.సీ.ఎం.ఎస్ వైస్ చైర్మన్ దుర్గం పూడి నారాయణరెడ్డి, ఎం.పి.పిలు నూకల సరళ హనుమంతు రెడ్డి, ధీరావత్ నందిని రవితేజ, ధనవాత్ బాలాజీ నాయక్, ఆర్.డి.ఓ చెన్నయ్య,

 

జడ్పీటీసీ లు అంగోతు లలిత హతిరాం నాయక్, కుర్రా సేవ్యా నాయక్, మాజీ ఎం.పి.పి తిరుపతమ్మ, కురాకుల మంగమ్మ, సీనియర్ నాయకులు అన్నభిమోజు నాగార్జున చారి, నాయకులు, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు.