రేపు నల్గొండ ఎన్.జి కళాశాలలో జాబ్ రిక్రూట్మెంట్ డ్రైవ్..!
నల్గొండ లోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలోని తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో కీర్తన ఫిన్ సర్వ్ గోల్డ్ లోన్స్ సంస్థ సహకారంతో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. ఉపేందర్ మరియు టీఎస్ కేసి కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. అనిల్ కుమార్ తెలిపారు.

రేపు నల్గొండ ఎన్.జి కళాశాలలో జాబ్ రిక్రూట్మెంట్ డ్రైవ్..!
నల్లగొండ, మన సాక్షి:
నల్గొండ లోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలోని తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో కీర్తన ఫిన్ సర్వ్ గోల్డ్ లోన్స్ సంస్థ సహకారంతో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. ఉపేందర్ మరియు టీఎస్ కేసి కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. అనిల్ కుమార్ తెలిపారు. రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ మరియు ట్రైనీ లోన్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారని తెలిపారు.
ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు నెలకు రూ.14,000, ట్రైనీ లోన్ ఆఫీసర్ పోస్టుకు నెలకు రూ. 15,000 పనితీరు ఆధారిత ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు అందించనున్నారు. ప్రావీడెంట్ ఫండ్, ఈఎస్ ఐ మెడికల్ ఇన్సూరెన్స్‌తో పాటు శిక్షణ కెరీర్ అభివృద్ధి అవకాశాలు కూడా సంస్థ అందించనుందని అన్నారు.
ALSO READ : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 13706 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నేటి నుంచే దరఖాస్తులు..!
ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ఫ్రెషర్స్ ,ఇటీవల ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. అభ్యర్థుల వయోపరిమితి 26 సంవత్సరాలు.ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు రేపు 2న ఉదయం 9:30 గంటలకు నాగార్జున ప్రభుత్వ కళాశాల సెమినార్ హాల్‌కు అప్డేట్ చేసిన రెజ్యూమ్ విద్యా/అవసరమైన సర్టిఫికెట్లతో హాజరు కావాలని నిర్వాహకులు సూచించారు.









