మిర్యాలగూడ : అమరవీరులకు నివాళులర్పించిన ఎమ్మెల్యే భాస్కరరావు

మిర్యాలగూడ : అమరవీరులకు నివాళులర్పించిన ఎమ్మెల్యే భాస్కరరావు
మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా నేడు ఉద్యమ అమరులకు రాష్ర్ట వ్యాప్తంగా నివాళలర్పరిస్తున్నారు. అందులో భాగంగా గురువారం మిర్యాలగూడ మండల పరిధిలోని వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన అమరుడు రావులపెంట భిక్షంకి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు నివాళులర్పించారు.
భిక్షం కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి. వెంకటాద్రిపాలెం గ్రామంలోని అమరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమరుడు భిక్షం త్యాగనిరతిని ప్రస్థావిస్తూ ఎమ్మెల్యే భాస్కర్ రావు, బీ.ఆర్.ఎస్ నాయకులు, రెండు నిమిషాలు మౌనం పాటించారు.
🔴 ఎక్కువ మంది చదివిన వార్తలు.. మీరు కూడా చదవండి👇
🟢 Rythu Bandhu : రైతు బంధు కోసం దరఖాస్తులు చేసుకోవాలి..!
🟢 Central scheme | ఈ పథకంలో చేరితే.. రైతులకు నెలకు రూ. 3 వేలు..!
🟢 RBI : రూ. 30 వేల కంటే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే.. ఆర్బీఐ క్లారిటీ..!
🟢 PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కొత్త సర్వీసులు, కస్టమర్లకు రూ. 2 లక్షల ఆదా…!
అమరుల త్యాగాలు.. వృథా కాలేదని, వారి త్యాగనిరతి వెలకట్టలేనిది. తెలంగాణ ప్రగతి పథంలో కొనసాగుతోంది. ఉద్యమ దృవతారలకు… ఇవే మన ఘన నివాళులని ఎమ్మెల్యే అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదురుగా గల అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు…ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి , మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ,
నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , యం.పి.పి నూకల సరళ హనుమంత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ ధనవత్ చిట్టిబాబు నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, నాయకులు జొన్నలగడ్డ రంగారెడ్డి, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, మండల రైతు బంధు సమితి అద్యక్షులు గడగోజు ఏడుకొండలు,
బి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సాగర్, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డ్ ఇంచార్గ్లు, సర్పంచులు, బి.ఆర్.ఎస్ నాయకులు, సర్పంచ్లు, యం.పి.టి.సిలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పోలీస్ అధికారులు, రెవిన్యూ అధికారులు, పంచాయతీ రాజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు….