Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsకరీంనగర్జిల్లా వార్తలురాజకీయం

ABVP : కలెక్టరెట్ ఎదుట ఉద్రిక్తత.. ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నం..!

ABVP : కలెక్టరెట్ ఎదుట ఉద్రిక్తత.. ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నం..!

కరీంనగర్, మనసాక్షి :

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలనీ డిమాడ్ చేస్తూ ఏబీవీపీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలసి కలెక్టరెట్ ఎదుట ఆందోళన చేశారు.

నగరంలోని తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరెట్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వెళ్లి ధర్నా చేపట్టారు. ఏబీవీపీ నాయకులు గేటు ఎక్కి కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులకు ఏబీవీపీ నాయకులకు మధ్య తోపులట ఏర్పడింది.

దింతో ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8700 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్స్ పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే మంత్రులను, ఎమ్మెల్యే లను అడ్డుకుంటామని హెచ్చరించారు.

MOST READ : 

  1. Nalgonda : అధిక ధరలకు యూరియా విక్రయం.. అధికారుల తనిఖీ.. పోలీసులు కేసు నమోదు..!

  2. Mushroom Coffee : మష్రూమ్ కాఫీ.. ఇది కేవలం ట్రెండ్ కాదు.. ఆరోగ్య రహస్యం..తెలుసుకోండి ఇలా..!

  3. Nalgonda : దళిత మైనర్ బాలికపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి.. పోక్సో కేసు నమోదు..!

  4. Cyber crime : ఆన్‌లైన్ మోసం.. రూ.2.80 లక్షలు పోగొట్టుకున్న గృహిణి..!

  5. TG News : నడి రోడ్డుపై ఏంటివి ఇవి.. ఇలా ఎందుకు పెట్టారు.. అయినా వాళ్లు ఇటువైపు చూడరు..!

మరిన్ని వార్తలు