Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలునిజామాబాద్

సాంబార్ లో పడిన బాలుడు మృతి..!

సాంబార్ లో పడిన బాలుడు మృతి..!

నిజామాబాద్ జిల్లా (భీంగల్) మన సాక్షి :

ఓ శుభకార్యంలో భోజనాల కోసం వండి ఉంచిన వేడి సాంబార్ లో పడిన బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామంలో చోటు చేసుకుంది. భీంగల్ పట్టణానికి చెందిన కర్నె నిహారిక తన మూడేళ్ల వయసున్న కొడుకుతో కలిసి ఈ నెల 19న ముచ్కూర్ లో బంధువుల ఇంట్లో జరుగుతున్న ఓ శుభకార్యానికి హాజరైంది.

అక్కడ పిల్లలతో చార్విక్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడిగా ఉన్న సాంబార్ బగొనీలో పడ్డాడు. బగోనీలోని వేడి సాంబార్ కారణంగా బాలుడి శరీరం మీద చర్మం ఊడి రావడంతో చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చార్విక్ బుధవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

MOST READ : 

  1. Rythu Bharosa : ఏదీ రైతు భరోసా.. ఆర్థిక శాఖ పక్కన పెట్టిందా.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Gold Price : వరుసగా రెండో రోజు కుప్పకూలిన బంగారం ధర..!

  3. TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రేషన్ కార్డులు కట్..!

  4. Indiramma Atmiya Bharosa : రైతు కూలీలకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!

మరిన్ని వార్తలు