District collector : తడిసిన ధాన్యం పరిశీలించిన జిల్లా కలెక్టర్.. అధికారులకు కీలక ఆదేశాలు..!
District collector : తడిసిన ధాన్యం పరిశీలించిన జిల్లా కలెక్టర్.. అధికారులకు కీలక ఆదేశాలు..!
కనగల్, మన సాక్షి:
తేమ శాతం 17 కు మించకుండా కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని అదేరోజు కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు . శనివారం రాత్రి కురిసిన వర్షం వల్ల నల్గొండ జిల్లా, కనగల్ మండలం, పొనుగోడు ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిందని తెలియగా ఆదివారం కలెక్టర్ కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సరైన తేమశాతంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని అదే రోజే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని, ఒకవేళ ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా జాప్యం చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను లోతట్టు ప్రాంతాల్లో కాకుండా, ఎత్తు ప్రాంతాలలో ఏర్పాటు చేసినట్లయితే కొనుగోలు కేంద్రంలోకి వర్షానికి నీరు రాకుండా ఉంటుందని కలెక్టర్ సూచించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ప్రతిరోజు తేమశాతాన్ని నమోదు చేయాలని, రిజిస్టర్ లను తప్పనిసరిగా నిర్వహించాలని అన్నారు .కొనుగోలు కేంద్రాలలో లారీలు సరిగా ఏర్పాటు చేయనట్లయితే కాంట్రాక్టర్ పై తగు చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్ ను ఆదేశించారు. కలెక్టర్ వెంట డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి, ఆర్డిఓ అశోక్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, కేంద్రం నిర్వాహకులు, తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Batti Vikramarka : తెలంగాణలో త్వరలో గ్రీన్ ఎనర్జీ.. 2025 మే నాటికి పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పాదన..!
-
Miryalaguda : సీఎం రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఘాటు వ్యాఖ్యలు..!
-
Ration Cards : రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం భారీ శుభవార్త..!
-
Big Alert : ఈ నెలలో రెండు రోజుల పాటు UPI సేవలు బంద్..!









