Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District collector : జిల్లా కలెక్టర్ ఆదేశం.. ఆ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి..!

District collector : జిల్లా కలెక్టర్ ఆదేశం.. ఆ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి..!

నారాయణపేట టౌన్, మన సాక్షి :

నారాయణపేట జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న అభివృద్ధి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. టి.జి. ఎంఎస్ఐడిసీ ప్రాజెక్టు పరిధిలో రూ.26 కోట్ల వ్యయంతో నారాయణపేట మండలంలోని అప్పక్ పల్లి వద్ద గల ప్రభుత్వ మెడికల్ కళాశాల/జిల్లా ఆస్పత్రి పక్కన కొనసాగుతున్న నర్సింగ్ కాలేజ్, రూ.40 కోట్ల నిధులతో చేపట్టనున్న ఎంసీహెచ్ (మెటర్నిటీ చైల్డ్ హెల్త్) సెంటర్ పనులను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు.

ముందుగా నర్సింగ్ కాలేజ్ నిర్మాణ పనులను చూసిన కలెక్టర్ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. నర్సింగ్ కాలేజ్ భవనంతో పాటు చుట్టూ ప్రహరీని ఏర్పాటు చేయాలన్నారు. కాలేజ్ కి అటు వైపు కొంత స్థలం ఆక్రమణ కు గురవుతుందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకు రావడంతో స్పందించిన కలెక్టర్ వెంటనే సర్వే చేయించి కాలేజ్ కి కేటాయించిన స్థలాన్ని పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవాలని స్థానిక తహసిల్దార్ అమరేంద్ర కృష్ణ ను ఆదేశించారు.

అనంతరం పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వెళ్లిన కలెక్టర్ ను మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంతోష్ కుమార్,మిగతా ప్రొఫెసర్లు, వైద్యులు ఆస్పత్రి కి తాగునీటి వసతి, ప్రధాన రహదారి నుంచి ఆస్పత్రి వరకు వీధి దీపాలు అవసరమని కోరారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఆమె తెలిపారు. ఆస్పత్రి ఆవరణ లోకి వచ్చిన ఆర్టీసీ బస్ ను చూసిన కలెక్టర్ అక్కడే ఉన్న ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య తో మాట్లాడి ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య ను దృష్టిలో ఉంచుకుని ప్రధాన రహదారీ నుంచి ఆసుపత్రి ఆవరణ లోకి బస్సులను నడిపించాలని సూచించారు.

తర్వాత ఆస్పత్రి వెనక భాగంలో ఎం సీ హెచ్ సెంటర్ నిర్మాణ పనుల ప్రారంభానికి చేస్తున్న లెవెలింగ్ పనులను పరిశీలించారు. లెవెలింగ్ పనులు వేగంగా పూర్తి చేసి ఎంసీ హెచ్ సెంటర్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులకు సూచించారు. చివరగా సింగారం మలుపు దారి వద్ద గల వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రం పక్కన దాదాపు పూర్తి కావస్తున్న హ్యాండ్లుమ్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను కలెక్టర్ పరిశీలించారు.

.రూ.8.50 కోట్ల తో చేపట్టిన హ్యాండ్ లూమ్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లో ఇంకా మిగిలిపోయిన డోర్స్, కిటికీలు, ఇతర ఎలక్ట్రికల్ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే సెంటర్ చుట్టూ ప్రహరీ నిర్మాణం, సీసీ రహదారి నిర్మాణం, టాయిలెట్ బ్లాక్ పనుల కోసం అదనంగా రూ.4 కోట్లు మంజూరు అయ్యాయని, ఆయా నిర్మాణ పనులను తొందరగా ప్రారంభించి పూర్తి చేసి హ్యాండ్ లూమ్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ప్రారంభానికి సిధ్ధం చేయాలని కలెక్టర్ టీజీ ఎంఎస్ఐడీసీ అధికారులకు సూచించారు.

సెంటర్ ఆవరణ లో నిరుపయోగంగా ఉన్న వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రానికి చెందిన మూడు మరుగు దొడ్ల కు మరమ్మతులు చేయించాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, టీజీ ఎంఎస్ఐడీసీ ఈ ఈ వేణుగోపాల్, డీ ఈ కృష్ణ మూర్తి, తహాసిల్దార్ అమరేందర్ కృష్ణ, ఏ ఈ సాయి మురారి తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Komatireddy : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్..!

  2. Nalgonda : రూ.500 నోటు.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ సస్పెండ్ కు కారణం..!

  3. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్లో ఉంచొద్దు..!

  4. Miryalaguda : గెస్ట్ మహిళ ఉపాధ్యాయుల కొరకు దరఖాస్తుల స్వీకరణ..!

  5. UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం.. ఏదైనా పిన్ నెంబర్ ఉండదు.. మరి లావాదేవీలు ఎలాగో తెలుసుకుందాం..!

మరిన్ని వార్తలు