Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్

Police Station : పోలీస్ స్టేషన్ స్థలానికే గట్టి బందోబస్తు.. చుట్టూ ఫెన్సింగ్..!

Police Station : పోలీస్ స్టేషన్ స్థలానికే గట్టి బందోబస్తు.. చుట్టూ ఫెన్సింగ్..!

మదనపల్లి, మన సాక్షి :

అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలోని అంగళ్లు కుమ్మరి ప్యాక్టరీ వద్ద పోలీస్ స్టేషన్ స్థలాన్ని పోలీసులు కట్టుదిట్టంగా భద్రత కల్పించారు. అన్యాక్రాంతం కాకుండా జేసీబీతో చదును చేసి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఇది టమటా మండీల ముందుగా ఉన్న విలువైన స్థలం. అదీ హైవే పక్కన ఉండడంతో భూ కబ్జాకు గురి కాకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టారు.

ముదివేడు ఎస్ఐ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఇక్కడ సర్వే నెంబరు.363/1లో 2019లో పది సెంట్ల స్థలాన్ని అప్పటి ప్రభుత్వం పోలీస్ స్టేషన్ కు కేటాయించింది. ఈ స్థలానికి వెనుకగా వున్న వైఎస్సార్ సీపీ నాయకురాలు రెడ్డి (డిష్)కుమారి కట్టించిన సాక్షి గణపతి ఆలయానికి కూడా పోలీసులు దారి వదిలారు.

MOST READ : 

మరిన్ని వార్తలు