Jagdeesh Reddy : రాష్ట్రంలో డెకాయిట్ల పాలన.. మంత్రి ఉత్తమ్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్..!
Jagdeesh Reddy : రాష్ట్రంలో డెకాయిట్ల పాలన.. మంత్రి ఉత్తమ్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్..!
సూర్యాపేట, మనసాక్షి
ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ని డెకాయిట్ లా పోల్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలను తప్పు పడుతూ అయన పై మాజీమంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
శనివారం సూర్యాపేట లో విలేకరుల తో మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిన దొంగలు, డెకాయిట్లు మీరేనని అన్నారు.
రేవంత్ రెడ్డి ని అనాల్సిన మాటలు ఉత్తమ్ మాపై వాడుతున్నారని, రేవంత్ ని అనడం చేతగాక కేసీఆర్ పై ఏడుస్తున్నారని ఆరోపించారు. నోట్లకట్టలతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన మీరు దొంగలని పదేళ్ళు ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన కేసీఆర్ ను దొంగా అని అనడం సరికాదన్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి బాష మార్చుకోవాలని పది సంవత్సరాల బి ఆర్ ఎస్ పాలన లో
ఎప్పుడు ఇలాంటి మాటలు కేసీఆర్ మమ్మల్ని మాట్లాడనీయలేదఅన్నారు. కాంగ్రెస్ పార్టీ లోకి
నీకంటే వెనక వచ్చిన వాడు సీఎం పదవి గుంజుకుంటే చేతగాని దద్దమ్మలా ఉత్తమ్ ఉండిపోయారని ఎద్దెవా చేశారు.
రాష్ట్రంలోనే డెకాయిట్ల, బులడోజర్ల పరిపాలన సాగితుందని రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ నాయకుల కమీషన్లు , దోపిడీ గురించి ప్రజలు చెబుతాన్నారని ఆరోపించారు.
బిఆర్ ఎస్ పాలనలో కట్టిన ప్రాజెక్టుల నుండి నీటిని అందించడం చేతగాక అవాకులు చెవాకులు మాట్లాడుతున్నా రని?నీళ్ళ కోసం , విద్యుత్ కోసం ప్రజలు రోడ్ల మీద ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తున్నారని ముందు వాటి గురించి ఆలోచించాలని హితువు పలికారు.
ప్రజా ధనంతో హెలికాఫ్టర్లలో తిరుగుతూ మంత్రులు సొల్లుకబుర్లు మాట్లాడుతున్నారని సాగు నీరు అందించడంలో ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ విఫలం అయ్యాడని విమర్శించారు.
కాళేశ్వరం నీటిని అందించకపోతే కాంగ్రెస్ నాయకులకు రైతులతో దెబ్బలు తప్పవని, రైతాంగ సమస్యల పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. త్వరలోనే రైతాంగ సమస్యల పై పోరాటం చేసేందుకు కేసీఆర్ కార్యచరణ ప్రకటిస్తారని ప్రభుత్వం మెడలు వంచి రైతులను ఆదుకుంటాం అని చెప్పారు.
LATEST UPDATE :
దేవతల కొండపై గుప్తనిధుల తవ్వకాలు.. అత్యంత ఖరీదైన పురాతన విగ్రహాల చోరీ..!
రేవంత్, బట్టి విక్రమార్క, ఉత్తమ్ భేటీ.. కీలక నిర్ణయం..!
TG NEWS : తెలంగాణ కాంగ్రెసులో కోల్డ్ వార్..? ఉత్తమ్ సీఎం అవుతారంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు..!
నిరుద్యోగులకు శుభవార్త.. 2280 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!









